Tollywood: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ హీరోయిన్లకు సంబంధించిన ఏదో ఒక వార్త నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది. స్టార్ హీరోయిన్ల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి నేటిజెన్లు చాలా ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గురించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈమె ఒకప్పుడు టాలీవుడ్ లో వరస సినిమా అవకాశాలతో బిజీగా ఉంది.
తాజాగా ఈ హీరోయిన్ బాలీవుడ్ (Tollywood) కు షిఫ్ట్ అయింది. చిన్నప్పుడు స్కూల్లో చదువులో బాగా రానించి టాపర్గా ఉండేది. ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ కావాలని ఎన్నో కలలు కంది. కానీ అనుకోని కారణాల వలన సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. నటన మీద తనకున్న ఆసక్తితోనే సినిమా రంగంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ రాశి ఖన్నా.
ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో రాశి ఖన్నా (Raashi Khanna) తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ విజయం అందుకొని వరుస సినిమా అవకాశాలను అందుకుంది. అయితే ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన రాశిఖన్నా స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ది సబర్మతి రిపోర్ట్ అనే సినిమాతో హిందీ ప్రేక్షకులను అలరించింది. ప్రముఖ ఓటీటీ జి ఫైవ్ లో ప్రస్తుతం ఈ సినిమా అందుబాటులో ఉంది.
View this post on Instagram