Shoban Babu Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు సీనియర్ హీరోలు శోభన్ బాబు (Shoban Babu) మరియు చిరంజీవి (Chiranjeevi) ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు.కృష్ణ జిల్లాలోని నందిగామ కు చెందిన శోభన్ బాబు ఎవరి సహాయం లేకుండానే మద్రాస్ వెళ్లి సినిమాల్లోకి అడుగుపెట్టారు.ఫ్యామిలీ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యిన శోభన్ బాబు ఫ్యామిలీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారిపోయారు.పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు కు చెందిన కొణిదెల శివశంకర ప్రసాద్ తన స్వయం కృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవి గా ఎదిగారు.
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి దాదాపుగా 12 మంది హీరోలు ఉన్నారు అంటే అందుకు చిరంజీవి గారు వేసిన పునాది కారణం.అప్పటి తరంలో ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ,కృష్ణం రాజు వంటి హీరోలకు పోటీగా శోభన్ బాబు సినిమాలు చేసేవారు.ఇలా స్వయంకృషి తో ఎదిగిన ఇద్దరు హీరోలు కలిసి ఓకే టైటిల్ తో ఉన్న సినిమాలు చేసారు.శోభన్ బాబు హీరోగా జేబు దొంగ అనే సినిమాను 1975 లో తెరకెక్కించారు.
సమతా ఆర్ట్స్ యోగేంద్ర నిర్మాణంలో విక్టరీ మధుసూధనా రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో మంజుల శోభన్ బాబు కు జోడిగా నటించారు.జేబు దొంగ (Jebu Donga) వంటి మాస్ చిత్రంతో శోభన్ బాబు హిట్ అందుకున్నారు.చిరంజీవి 1987 లో జేబు దొంగ అనే టైటిల్ లో సినిమా చేసారు.ఈ చిత్రాన్ని అర్జున్ రాజు,రామలింగ రాజు నిర్మాణంలో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో రాధా,భాను ప్రియా హీరోయిన్లుగా చేసారు.చిరంజీవి కూడా జేబు దొంగ అనే చిత్రంతో హిట్ అందుకున్నారు.ఇక ఒకే టైటిల్ తో వచ్చిన రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.