Vomiting Tips: ప్రయాణంలో వాంతులతో ఇబ్బంది పడుతున్నారా….అయితే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.!

Vomiting Tips
Vomiting Tips

Vomiting Tips: చాల మందికి ప్రయాణాలు చేయాలి అంటే చాల ఇష్టం.పని వత్తిడి నుంచి బయట పడడానికి ఫ్యామిలీతో కలిసి దూరప్రాంతాలకు ప్రయాణం అవుతుంటారు చాల మంది.మరికొంత మందికి ప్రయాణం చేసేటప్పుడు వాంతులు అవుతాయి అనే భావనతో ప్రయాణం చెయ్యాలంటే భయపడిపోతుంటారు.చాల మందికి బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది.

అయితే ఇలా బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు వాంతులు అవకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది అంటున్నారు చాల మంది నిపుణులు.ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు మనకు వాంతులు అవుతాయేమో అనే ఆలోచనను కూడా మన మనసులోకి రాకుండా చూసుకోవాలి.బస్సులో ప్రయాణించేటప్పుడు ముందు సీట్ లో కూర్చోడం వలన బయట వాతావరణం కనిపించడం వలన వాంతులు అవుతాయి అనే విషయాన్నీ మరిచిపోయే అవకాశం ఉంటుంది.

అలాగే మన పక్కన ఉన్న వాళ్లతో కూడా మాట్లాడటం,ఇష్టమైన పాటలు వినడం,కామెడీ వీడియోలు అలాంటివి చూసి మన మైండ్ డైవర్ట్ చేసుకోవడం వంటివి చేస్తే సాధ్యమైనంత వరకు వాంతులు అవకుండా చూసుకోవచ్చు.అలా చేసిన కూడా వాంతులు అవుతాయి అని అనుకుంటే కొంచెం అల్లం తీసుకోవడం లేక నిమ్మకాయ వాసనా చూడడం వంటివి కూడా చేయవచ్చు.ఏది ఏమైనా కూడా ముందుగా మనకు వాంతులు అవుతాయి అనే భావనను మన మైండ్లోకి రానీకుండా చూసుకోవాలి అంటున్నారు నిపుణులు.