Home » తాజా వార్తలు » TG Inter Results 2025: మరి కాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈజీగా ఇలా తెలుసుకోండి

TG Inter Results 2025: మరి కాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈజీగా ఇలా తెలుసుకోండి

TG Inter Results 2025
TG Inter Results 2025

TG Inter Results 2025: 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22, మంగళవారం రోజున విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంగళవారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఫలితాలు ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 22, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య దీని గురించి వెల్లడించారు. అలాగే ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరు కానున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి గాను దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షలు రాశారు.

మంగళవారం మధ్యాహ్నం ఫలితాలు విడుదల అయిన తర్వాత ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ తో https://tgbie.cgg.gov.in/ పాటు టీవీ9 తెలుగు అధికారిక వెబ్సైట్లో కూడా విద్యార్థులు నేరుగా ఫలితాలను చూసుకోవచ్చు. అలాగే ఇంటర్ విద్యార్థులు ఐవిఆర్ పోర్టల్ 9240205555 ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ఇంటర్ ఫలితాలు చూసుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. అలాగే ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించారు.