PAN Card: జూలై 1 నుంచి పాన్ కార్డు పై కొత్త రూల్.. మీకు పాన్ కార్డు కావాలంటే కచ్చితంగా ఇలా చేయాల్సిందే

PAN Card
PAN Card

PAN Card: ప్రతి ఒక్కరి పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండడం తప్పనిసరి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దేశంలో పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రభుత్వం పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింకు తప్పనిసరిగా చేసింది. జులై 1 నుంచి తప్పకుండా ప్రతి ఒక్కరూ పాన్ కార్డు కోసం ఆధార్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసి ఉండాలి. తమ పాత పాన్ కార్డులను డిసెంబర్ 31, 2025 నాటికి ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలి. ఏ బ్యాంకులో అయినా సరే ట్రాన్సాక్షన్ చేయాలి అంటే పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ తెరవాలి అనుకున్న కూడా మీకు పాన్ కార్డు ముఖ్యంగా అడుగుతారు.

పాన్ కార్డుకు సంబంధించి దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారము మీరు ఇకపై పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. దేశంలో మోసాలను నివారించడానికి అలాగే పన్ను వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను చేపట్టినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇకపై మీరు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే మీకు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఇంకా ఆధార్ కార్డు లేని వాళ్ళు వీలైనంత త్వరగా ఆధార్ కార్డును చేయించుకొని ఆ తర్వాత పాన్ కార్డును పొందవచ్చు.

ఇక ఆధార్ కార్డుకు సంబంధించి ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేయని వారు కూడా తప్పకుండా వెంటనే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. పన్ను ఎగవేతలను అరికట్టడానికి అలాగే పన్ను చెల్లింపుదారుల గుర్తింపును కచ్చితంగా భావించడానికి ప్రభుత్వం ఈ ముఖ్యమైన చర్య చేపట్టింది. కాబట్టి మీరు కొత్త పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నాట్లయితే ముందుగా మీరు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఇప్పటివరకు మన దేశంలో చాలామంది ప్రజలు పాస్పోర్టు, ఐడి కార్డు లేదా బర్త్ సర్టిఫికెట్ వంటి ముఖ్యమైన పత్రాలను పెట్టి పాన్ కార్డును పొందేవారు. కానీ జూలై 1 నుంచి వస్తున్న కొత్త రూల్ ప్రకారం పాన్ కార్డు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now