Home » బిజినెస్ » Free Houses: ఇళ్ల నిర్మాణం పూర్తి.. 3 లక్షల మందికి ఉచిత ఇళ్ల పంపిణీ…తేదీ ప్రకటించిన ప్రభుత్వం

Free Houses: ఇళ్ల నిర్మాణం పూర్తి.. 3 లక్షల మందికి ఉచిత ఇళ్ల పంపిణీ…తేదీ ప్రకటించిన ప్రభుత్వం

Free Houses
Free Houses

Free Houses: గత ఐదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ పేదలు మరియు లబ్ధిదారులు ఉచిత ఇళ్ల పథకానికి నోచుకోలేదు. గతంలో టిడిపి ప్రభుత్వం హయాంలో నిర్మించిన పలు ఇల్లు ఇప్పటివరకు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక శుభవార్త చెప్పింది. ఈ ఏడాది లో అంటే మరో రెండు నెలల్లో కూటమి ప్రభుత్వం మూడు లక్షల టిడ్కో ఇల్లా నిర్మాణాన్ని పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి సర్వేన కూడా చేపట్టింది.

కూటమి ప్రభుత్వానికి జూన్ 12వ తేదీ నాటికి ఏడాది పాలన పూర్తి అవుతున్న సందర్భంలో అప్పటిలోగా మూడు లక్షల ఇళ్లను పంపిణీ చేయనుందని తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పేదలందరికీ నాణ్యమైన ఇల్లు నిర్మిస్తామనే వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సన్నాహాలు కూడా చేపట్టింది. వాస్తవానికి ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన 1.14 లక్షల ఇళ్లకు సామూహిక ప్రారంభోత్సవం చేయించాలని ముహూర్తం కూడా పెట్టుకుంది. కానీ ఫిబ్రవరి నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్లు వీటిని వాయిదా వేశారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశలలో నిలిచిపోయిన మరో 1.70 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది. అలాగే మిగిలిన 60 వేల ఇళ్లను కూడా జూన్ నెలలోపే పూర్తి చేసేందుకు ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. దాంతో ప్రభుత్వం జూన్ నెలలోపు మూడు లక్షల ఇళ్లను పూర్తి చేసి వాటికి సామూహిక ప్రారంభ ఉత్సవాలు నిర్వహించేందుకు ఇప్పటినుంచి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సొంత గూడు లేని అర్హులైన పేదలందరిని గుర్తించి వారికి పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తుంది. ఇక వాటిలో అర్హులైన లబ్ధిదారులకు నాణ్యమైన ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సర్వేను ప్రారంభించడం జరిగింది.