యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరుపుకున్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా…

Anchor Suma House

Anchor Suma House: బుల్లితెర మీద ఏ షో అయినా,సినిమా ఈవెంట్ అయినా ముందుగా అందరికి గుర్తొచ్చే పేరు యాంకర్ సుమ.అంతలా సుమ తన యాంకరింగ్ తో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో క్రేజ్ ను,ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.సినిమా ఇండస్ట్రీలోకి మొదట నటిగా ఎంట్రీ ఇచ్చిన సుమ హీరోయిన్ గా సక్సెస్ సాధించలేకపోయింది.అయితే బుల్లితెర మీద మాత్రం తిరుగులేని యాంకర్ గా గుర్తింపును సంపాదించుకొని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.బుల్లితెర మీద క్యాష్,భలే ఛాన్స్ లే,స్టార్ మహిళా,జీన్స్ వంటి షోలతో బుల్లితెర మీద రికార్డులు క్రియేట్ చేసింది యాంకర్ సుమ.

ఇటీవలే జయమ్మ పంచాయతీ అనే సినిమాతో సుమ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధిచలేకపోయింది.కానీ ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది సుమ.అయితే సుమ తో పాటు ఆమె ఇంటికి కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పచ్చు.టాలీవుడ్ లో చాల మంది స్టార్ హీరోల సినిమాలలో సుమ ఇల్లు కనిపించింది అనే సంగతి చాల మందికి తెలియదు.ఆ సినిమాలు ఏంటంటే…సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య,తమన్నా జంటగా చేసిన సినిమా 100 % లవ్ సినిమా షూటింగ్ దాదాపుగా అధిక శాతం వరకు సుమ ఇంట్లోనే జరిగింది.

Anchor Suma House

అలాగే ఎన్టీఆర్ శ్రీను వైట్ల కంబినేషన్లో వచ్చిన బాద్ షా సినిమా లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇల్లు కూడా సుమ సొంత ఇల్లే అనే సంగతి చాల మందికి తెలిసి ఉండదు.మహేష్ బాబు దూకుడు సినిమాలో కూడా ఇంటి మూడు చాల సీన్స్ చూసే ఉంటారు.అయితే ఆ ఇల్లు కూడా సుమదే.హీరో రాంచరణ్ బ్రుస్ లీ,సునీల్ హీరోగా చేసిన పూలరంగడు సినిమాలోని ఇల్లు కూడా సుమదే.యాంకర్ సుమ ఇల్లు అందంగా,షూటింగ్స్ కు అనువుగా ఉండడంతో దాదాపు చాల సినిమాలలో సుమ ఇంటిని ఉపయోగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *