సినిమా ఇండస్ట్రీలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మారిన 5 గురు స్టార్స్ వీళ్ళే….

సినిమా ఇండస్ట్రీలో ముందు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ గా చేసిన వాళ్ళు చాల మందే ఉన్నారు.కానీ మొదట ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా స్టార్ హీరోగా ఎదిగిన వాళ్ళు అతి కొద్దీ మంది మాత్రమే ఉన్నారని చెప్పచ్చు.అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా విలన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మారిన వాళ్ళు కొంత మందే ఉన్నారని చెప్పచ్చు.

చిరంజీవి:మెగాస్టార్ చిరంజీవి ముందుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి విలన్ గా పరిచయం అయ్యారు.ఇది కథ కాదు,మోసగాడు వంటి పలు సినిమాలలో చిరంజీవి విలన్ గా నటించిన సంగతి అందరికి తెలిసిందే.ఆ తర్వాత ఆయన టాలెంట్ చూసి హీరోగా అవకాశం రావడంతో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని యేలే స్థాయికి ఎదిగారు అని చెప్పచ్చు.

మోహన్ బాబు:డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ముందుగా స్వర్గం నరకం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఈయన కూడా కెరీర్ మొదట్లో పవర్ ఫుల్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తర్వాత హీరో అవకాశాలు రావడంతో స్టార్ హీరోగా కలెక్షన్ కింగ్ గా ఎదిగారు.

గోపీచంద్:తొలివలపు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు గోపీచంద్.ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.ఆ తర్వాత నితిన్ హీరోగా చేసిన జయం సినిమాలో విలన్ పాత్రలో గోపీచంద్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.ఆ తర్వాత హీరోగా కూడా అవకాశాలు రావడంతో హీరోగా ఎదిగారు గోపీచంద్.

రాజశేఖర్:ఈయన కెరీర్ ప్రారంభంలో తలంబ్రాలు అనే చిత్రంలో విలన్ గా నటించారు.ఈ సినిమాకుగాను నంది అవార్డును సొంతం చేసుకున్నారు.ఆ తర్వాత హీరోగా కూడా రాణించి మంచి సక్సెస్ అందుకున్నారు.

జెడి చక్రవర్తి:ఈయన కూడా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలు చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో హీరోగానూ మరియు విలన్ గాను రాణిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *