Home సినిమా బాలయ్య అన్ స్టాపబుల్ షో లో ప్రభాస్,గోపీచంద్…స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా…

బాలయ్య అన్ స్టాపబుల్ షో లో ప్రభాస్,గోపీచంద్…స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా…

0
Balakrishna Unstoppable 2 Prabhas Gopi Chand
Balakrishna Unstoppable 2 Prabhas Gopi Chand

Unstoppable 2 : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సెలెబ్రిటీ టాక్ షో చాల విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది.బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కు ప్రత్యేక క్రేజ్ ఉందని చెప్పచ్చు.దేశవ్యాప్తంగా ఈ షో మొదటి సీజన్ టాప్ టిఆర్పి ని దక్కించుకుంది.ప్రముఖ ఓటిటీ ఆహా లో ఈ షో ప్రసారం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇప్పటి వరకు ఈ షోలో టాలీవుడ్ నుంచి చాల మంది హీరోలు వచ్చారు.త్వరలో ఈ షో లో పాన్ ఇండియా స్టార్ రాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియా లో చాల బలంగా వినిపిస్తుంది.రోజురోజుకు ఈ షో క్రేజ్ పెరుగుతుందని చెప్పచ్చు.

ప్రస్తుతం ఈ షో లో పాన్ ఇండియా స్టార్ రాబోతున్నారని తెలియడంతో అభిమానులలో బాగా ఆసక్తి నెలకొంది.ఆ పాన్ ఇండియా స్టార్ మరెవరో కాదు బాహుబలి,సాహో,రాధేశ్యామ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్.బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో 2 లో త్వరలో ప్రభాస్ కనిపించనున్నారు.

Balakrishna Unstoppable 2 Prabhas Gopi Chand

ఈ షో కు ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ తో కలిసి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ ఎపిసోడ్ డిసెంబర్ 16 శుక్రవారం ప్రసారం కానుందని తెలుస్తుంది.ఇక ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ డిసెంబర్ 11 ఆదివారం రోజున జరగనుందని సమాచారం.ఈ ఎపిసోడ్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు గోపీచంద్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.ప్రభాస్,గోపీచంద్ తర్వాత బాలయ్య అన్ స్టాపబుల్ షో లో సీనియర్ నటీమణులు అయినా జయసుధ మరియు జయప్రద కలిసి రాబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.మరోపక్క బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here