AP SC Corporation Loans: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు ఉచితంగా రూ.50 వేలు సాయం

AP SC Corporation Loans: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు ఉచితంగా రూ.50 వేలు సాయం
AP SC Corporation Loans: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు ఉచితంగా రూ.50 వేలు సాయం

AP SC Corporation Loans: తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేక గైడ్లైన్స్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక సహాయం అందించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ముందుకు వచ్చింది.

దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 11, 2025 నుంచి మే 20, 2025 వరకు కొనసాగు నుండి. మెడికల్ షాపులు, డయాగ్నొస్టిక్ ల్యాబ్లో, ఎలక్ట్రిక్ ఆటోలు, ఎలక్ట్రిక్ బ్యాటరీ చార్జింగ్ యూనిట్లు, గూడ్స్ ట్రక్, కార్ల యూనిట్ల వంటి వివిధ రంగాల్లో ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఆర్థిక సాధికారతను పెంచి వాళ్లకు స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి రూపొందించింది. అయితే ఈ రుణాలను ప్రభుత్వం బ్యాంకులతో సమన్వయం చేసి వాళ్లకు అందజేయనుంది.

ఇది చదవండి: ఉచిత గ్యాస్ సిలిండర్ పై కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

ఈ పథకంలో ఒక్కో యూనిట్కు లక్ష నుంచి 3 లక్షల వరకు రుణం అందుబాటులో ఉంటుందని అలాగే 50 వేల వరకు సబ్సిడీగా ఇవ్వనున్నట్లు కూడా అధికారులు తెలిపారు. ఎస్సీ వర్గాలకు చెందిన యువత ఈ రుణాల ద్వారా సొంత వ్యాపారాలు ప్రారంభించడం లేదా ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి సాధ్యపడుతుంది.

లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ పథకం కింద ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలుస్తుంది. ఈ పథకం కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభం చేయడానికి ఓబి ఎంఎంఎస్ పోర్టల్ ను ఉపయోగిస్తున్నారు. ఈ పథకం కు దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్ళు తమ ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం వంటి పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.

రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక ఉపవసమనం కల్పించడంతోపాటు వాళ్లకు ఆధునిక రంగాలైన ఎలక్ట్రిక్ వాహనాలు మరియు లాజిస్టిక్స్ వంటి రంగాల్లో కూడా అవకాశాలు సృష్టించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యంగా తెలుస్తుంది.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now