Pan Card: ఇంట్లో నుంచే పాన్ కార్డులో ఉన్న ఫోటోను ఇలా సులభంగా మార్చుకోండి

Pan Card
Pan Card

Pan Card: ప్రతి ఒక్కరికి కూడా ఆదాయపు పన్ను శాఖ వారు జారీ చేసిన పది అంకెల ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ అంటే పాన్ కార్డు ఉంటుంది. దేశ పౌరుడు ఆర్థిక వివరాలు పాన్ కార్డు కలిగి ఉంటుంది. అయితే పాన్ కార్డులో ఉన్న ఫోటోను మార్చుకోవాలంటే ఇకపై ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆర్థిక వ్యవహారాలకు పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. పది అంకెల ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ ను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. ఒక పౌరుడి ఆర్థిక వివరాలు ఇందులో ఉంటాయి. ఇకపై ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండానే పాన్ కార్డులో ఉన్న ఫోటోను మార్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది.

ముందుగా మీరు https://tinpan.proteantech.in/ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. అందులో సర్వీసెస్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి పాన్ పై క్లిక్ చేయాలి. పాన్ వివరాలలో మార్పులు లేదా సవరణ వంటి ఆప్షన్ ఎంచుకోవాలి. ఒకవేళ దరఖాస్తు చేస్తున్నట్లయితే దరఖాస్తుపై క్లిక్ చేయాలి. కొత్త పాన్ కార్డు పొందడం కోసం అభ్యర్థన, మార్పులు లేదా పాన్ వివరాలు దిద్దుబాటు వంటి ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీరు నిబంధనలను అంగీకరిస్తున్నట్లు బాక్స్ ను టిక్ చేయాలి.

మొత్తం సమాచారంతోపాటు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. ఆ తర్వాత పాస్పోర్ట్ సైజు ఫోటోను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత రుసుము చెల్లించాలి. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు 15 అంకెల రసీదు అందుతుంది. మీరు దీనికోసం గుర్తింపు కార్డు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ పెట్టొచ్చు. పుట్టినరోజు ఋజువు కింద మీరు ఆధార్ లేదా జనన ధ్రువీకరణ పత్రం లేదా పాస్పోర్టు పెట్టొచ్చు. మీరు పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోను అప్లోడ్ చేయాలి.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now