Gas Cylinders: త్వరలో భారీగా పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రధాన కారణం ఇదే

Gas Cylinders
Gas Cylinders

Gas Cylinders: మన దేశ స్థానం పెట్రోల్ మరియు డీజిల్ విషయంలో చాలా మెరుగ్గా ఉందని చెప్పొచ్చు. మనదేశంలో పెట్రోలులో 40% అలాగే డీజీలలో 30% ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం ఇరాన్లో జరిగిన మూడు ప్రధాన అను కేంద్రాలపై దాడులు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చురు ఉత్పత్తి ప్రాంతం నుండి మన దేశానికి సరఫరా అంతరాయం కలుగుతుంది అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంది. అశుద్ధి కర్మగారాలతో పాటు దిగుమతి టర్మినెల్స్, బ్లాటింగ్ ప్లాంట్లలో మనదేశంలో ఎల్పిజి నిలువ సామర్థ్యం సగటున వినియోగానికి 16 రోజులకు మాత్రమే సరిపోతుందని తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం మీరు వంటకు యూస్ చేసే గ్యాస్ సిలిండర్ పై కూడా ఉంటుంది. దీని ప్రభావం కారణంగా మన దేశంలో త్వరలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. సిలిండర్ ధరలపై ఈ యుద్ధం ప్రభావం భారీగా పడనుంది. ఎందుకంటే ఇప్పటివరకు మన దేశంలో ఉన్న ప్రతి మూడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లలో రెండు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో మధ్య ఆసియా నుంచి దిగుమతి అయినవే. అమెరికా దాడులు ఇరాన్లో ఉన్న మూడు ప్రధాన అను కేంద్రాలపై పడడంతో అతిపెద్ద చుమురు ఉత్పత్తి ప్రాంతం నుంచి మన దేశానికి ఎల్పిజి సరఫరా అంతరాయం ఏర్పడుతుందని తెలుస్తుంది.

తాజాగా ఈ టి ఇచ్చినా నివేదిక ప్రకారం అమెరికా దాడులు ఇరాన్ అనుకేంద్రాలపై ఉండడంతో ప్రపంచంలో అతిపెద్ద చుమురు ఉత్పత్తి ప్రాంతమైన పశ్చిమాసియా నుంచి మన దేశానికి సరఫరా అంతరాయం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు. గడిచిన పదేళ్ల నుంచి మన దేశంలో ఎల్పిజి వినియోగం రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. మనదేశంలో 33 కోట్ల ఇళ్లకు ఎల్పిజి చేరుకుంది. అందులో 66% ఎల్పీజీ విదేశాల నుంచి వచ్చిన. 95% సౌదీ అరేబియా, యూఏఈ మరియు ఖతార్ వంటి పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి అయినదే.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now