Todays Gold Rate: బంగారం కొనుగోలు చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది మంచి అవకాశం. వరుసగా రెండోసారి కూడా మన దేశం మార్కెట్లో బంగారం ధరలు దిగి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనం అవడంతో మన దేశ మార్కెట్లో కూడా ప్రభావం కనిపిస్తుంది. ఇటీవలే యూరోపియన్ యూనియన్ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 50% సుంకాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగి వస్తున్నాయి.
మనదేశంలో బంగారానికి బాగా డిమాండ్ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఏదైనా శుభకార్యాలు జరిగితే ముందుగా మహిళలకు గుర్తొచ్చేది బంగారమే. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. వరుస సెషన్లలో అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 100 డాలర్ల వరకు బంగారం ధర తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్లో కూడా వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. నిన్న రూ.440 రూపాయలు తగ్గిన 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ.160 రూపాయలు తగ్గింది. దాంతో ఈరోజు స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.97,480. 22 క్యారెట్ల ఆర్నమెంట్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ.550 రూపాయలు తగ్గడంతో రూ.89,350 గా ఉంది. ఇక ఈరోజు మన దేశ మార్కెట్లో వెండి ధర స్థిరంగా ఉంది. ఈరోజు కిలో వెండి ధర రూ.1,11,000 గా ఉంది.