Vastu Tips: ఆర్థిక సమస్యలు ఉన్నాయా…ఇంట్లో ఈ చిన్న చిన్న వాస్తు తప్పులే కారణం

Vastu Tips
Vastu Tips

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఆర్థిక పరిస్థితులకు మరియు వాస్తుకు మధ్య సంబంధం ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. వాస్తు శాస్త్రం కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే కాదు ఇంట్లో ఉండేటట్లు మీద కూడా. మనం పొరపాటున కూడా ఇంట్లో చేసే పని తప్పుల కారణంగా వాస్తు ప్రకారం ఇంట్లో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కొంతమంది కొత్త చెప్పులు కొన్ని పాత చెప్పులను కూడా అలాగే పెట్టుకుంటారు. ఇంట్లో పాడైపోయినా లేదా చిరిగిపోయిన పాత చెప్పులను అలాగే ఉంచుతారు.

కానీ ఇలా పాడైపోయినా లేదా చిరిగిపోయిన పాత చెప్పులను ఇంట్లో పెట్టుకోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. దీని కారణంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి ఉపయోగించని చెప్పులను బయటపడేయడం మంచిది. అలాగే ఇంట్లో పాడైపోయిన ఆహారాన్ని కూడా నిల్వ ఉంచకూడదు. ఇలా చేయడం వలన కూడా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలకు కూడా ఇవి కారణం అవుతాయి. ముఖ్యంగా ఇంట్లో చేసే ఈ చిన్న చిన్న పొరపాటు అప్పులు పెరగడానికి కారణం అవుతాయి. అలాగే కొంతమంది ఇంట్లో పాత న్యూస్ పేపర్లను పెట్టుకుంటారు. ఇలా కూడా చేయకూడదని వాస్తు శాస్త్రానిపుణులు చెప్తున్నారు.

కుప్పగా ఇంట్లో న్యూస్ పేపర్లను పెట్టడం వలన ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఎప్పటికప్పుడు పాత పేపర్లను బయటపడేయడం లేదా అమ్మడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఉపయోగంలో లేని చీపుర్లను కూడా ఇంట్లో పెట్టకూడదు. వీటివలన ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చీపురును లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. కాబట్టి ఇంట్లో చీపురు కూడా బాగా ఉండాలి. ఇంట్లో చీపురుని అందరికీ కనిపించేలాగా పెట్టుకోకూడదు. ఇంట్లో పాడైపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను ఎప్పటికప్పుడు బయటపడేయాలి. ముఖ్యంగా పాడైపోయిన ఇనుప సామాను ఇంట్లో పెట్టుకోకూడదు. వీటి వలన కూడా ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలతో పాటు మానసిక ఆరోగ్యం పై కూడా ఇవి ప్రభావం చూపుతాయి.