Milk Price: రోజురోజుకు పాల ధరలు పెరగడమే కానీ తగ్గడం లేదు. నిరంతరం పాలధారులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజల నెలవారి బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. వేతన జీవుల జేబులకు చిల్లులు పడే సందర్భం ఏర్పడింది. తాజాగా విజయ డైరీ మరోసారి పాల ధరను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య తాజాగా పాల ధరల సవరణ పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గేదె పాల ధరలు పెరగగా, ఆవుపాల ధరలు తగ్గినట్లు తెలుస్తుంది. ఈ కొత్త ధరలు ఏప్రిల్ ఒకటి, 2025 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ ధరల ప్రకారం ఏడు శాతం వెన్న శాతం ఉన్న గేదె పాల ధర లీటరుకు 56 రూపాయల నుంచి 59.50 కి పెరిగింది.
10 శాతం వెన్న ఉన్న గేదెపాల ధర 80 రూపాయల నుంచి 84 రూపాయలకు పెరిగింది. అలాగే మూడు శాతం వెన్న ఉన్న ఆవుపాల ధర 40 రూపాయల నుంచి 36 రూపాయలకు తగ్గింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి విజయ డైరీ ప్రస్తుతం ప్రతిరోజు 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుంది.
ఇది చదవండి: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం హెచ్చరిక.. రేషన్ కార్డు ఉన్నా కూడా ఇకపై వాళ్లకు రేషన్ బియ్యం రాదు
ఇందుకుగాను రైతులకు రూ. 1.5 కోట్ల నుంచి రెండు కోట్ల వరకు చెల్లింపులు చేస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ధరల సవరణ అవసరమని విజయ డైరీ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. విజయ డైరీ తీసుకున్న ఈ నిర్ణయంతో గేదెపాలు విక్రయించే రైతులకు లాభం చేకూరుతుంది. ఆవు పాలు గ్రహించే రైతులు నష్టపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గేదెపాల ధర పెరిగి ఆవుపాల ధరలు తగ్గడంతో రైతుల్లో అసంతృప్తి కలుగుతుంది. ముఖ్యంగా రైతులు ఈ ధరల తగ్గింపును ఆర్థికంగా భరించలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు. రైతులందరూ గేదెపాలధర పెంచారు కదా ఆవు కాల ధరను పెంచకుండా ఉండాల్సింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.