Post Office RD Scheme: మీరు కేంద్ర ప్రభుత్వ హామీతో ఉన్న ఏదైనా మంచి పెట్టుబడి పథకం కోసం చూస్తున్నట్లయితే మీకు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న రికరింగ్ డిపాజిట్ పథకం చాలా మంచి పథకం అని చెప్పొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన మీరు మెచ్యూరిటీ సమయానికి అద్భుతమైన రాబడినీ అందుకోగలుగుతారు. సామాన్య ప్రజల కోసం పోస్ట్ ఆఫీస్ లో అనేక బెస్ట్ పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పథకాలలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం మీరు ఈ పథకంలో రోజుకు 100 రూపాయలు పెట్టుబడి చేయడం వలన భారీ రాబడి అందుకోవచ్చు.
పోస్ట్ ఆఫీస్ వారు అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు ప్రతి నెల కొంత అమౌంట్ డిపాజిట్ చేయడం వలన భారీ వడ్డీ పొందవచ్చు. ఈ పథకం ప్రభుత్వ హామీతో ఉన్న పథకం కాబట్టి ఇది పూర్తిగా సురక్షితం. పోస్ట్ ఆఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు క్రమం తప్పకుండా ఐదేళ్లపాటు పెట్టుబడి పెడుతూ ఉండాలి. చిన్న మొత్తంలో కూడా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పథకంలో ఎటువంటి రిస్కు ఉండదు. ఏడాదికి మీకు 6.7% వడ్డీ రేటు లభిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. చిన్న చిన్న సేవింగ్స్ నుంచి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి ఇది చాలా అద్భుతమైన పెట్టుబడి పథకం. ఈ పథకంలో మీరు రోజుకు కేవలం 100 రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రతి నెల 3000 రూపాయలు డిపాజిట్ చేసినట్లు. ఇక ఈ విధంగా ఐదేళ్లపాటు మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మొత్తం రూ.1,80,000 అవుతుంది. దీనిపై మీకు 6.7% వడ్డీ రేటుతో రూ.34,097 వడ్డీ పొందవచ్చు. ఇక ఐదేళ్ల కాలం పూర్తి అయిన తర్వాత మీరు మొత్తం రూ.2,14,097 భారీ మొత్తాన్ని చేతికి అందుకోవచ్చు.