Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం మాత్రమే కాదు ఆ ఇంట్లో ఉన్న వస్తువులను కూడా వాస్తు శాస్త్రా నియమాలను అనుసరించి అమర్చుకోవాలి. ఇంట్లో ఉండే మెట్ల నిర్మించేటప్పుడు కూడా అనేక వాస్తు నియమాలను దృష్టిలో పెట్టుకోవాలి. మెట్ల కింద పెట్టే కొన్ని వస్తువుల విషయంలో ముఖ్యంగా వాస్తు నియమాలను పాటించాలి. మెట్ల కింద ప్రాంతంలో ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల వస్తువులను మెట్ల కింద పెట్టకూడదు. అవి ఇంట్లో నెగటివ్ ఎనర్జీని కలిగించే ప్రమాదం ఉంది.కొన్ని వస్తువులను ఇంట్లో మెట్ల కింద పెట్టడం వలన అనేక సమస్యలు వస్తాయి. ఇంటిని నిర్మించుకోవడానికి స్థలం తక్కువగా ఉన్నప్పుడు చాలామంది ఇంట్లో మెట్ల కింద కొన్ని రకాల వస్తువులను పెడుతుంటారు. మెట్ల కింద ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవాలని అనుకుంటారు.
అయితే మెట్ల కింద ఖాళీ స్థలం ఉంటే దానిని ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ ఖాళీ స్థలాన్ని ఉపయోగించేటప్పుడు వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి. వక్రంగా మెట్లను నిర్మిస్తారు. ఈ విధంగా చేయడం వలన మెట్ల కింద శక్తి అస్తవ్యస్తంగా ఉంటుంది. అక్కడ ప్రతికూల శక్తి ఉంటుంది. ఈ క్రమంలో మీరు మెట్ల కింద కొన్ని వస్తువులను పెట్టడం వలన అవి ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. కొంతమంది తమ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకుంటారు. అయితే ఈ పెంపుడు జంతువులను మెట్ల కింద ఉన్న ఖాళీ స్థలంలో పెట్టకూడదు.
మెట్ల కింద ఉండే ప్రతి కులశక్తి ఈ పెంపుడు జంతువులపై కూడా ప్రభావం చూపిస్తుంది. పెంపుడు జంతువు మానసికంగా చెదిరిపోయే అవకాశం ఉంది. లేదా ఆ పెంపుడు జంతువులు అనారోగ్యానికి కూడా గురి కావచ్చు. మెట్ల కింద ఉన్న ఖాళీ స్థలంలో మీరు స్టడీ టేబుల్ వేసి దానిని స్టడీ స్పేస్ గా మార్చుకోవద్దు. మెట్ల కింద కూర్చొని చదువుకునే పిల్లలు తమ చదువుపై దృష్టి పెట్టలేరు. ఇది వారి ఏకాగ్రతను ప్రభావితం చేస్తుంది. అలాగే మెట్ల కింద పూజ గది వంటివి కూడా నిర్మించకూడదు.
ఈ విధంగా చేయడం వలన ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి. డబ్బు పెట్టుకునే సేఫ్ లాకర్ లో కూడా లక్ష్మీదేవి నివసిస్తుంది అని నమ్ముతారు. కాబట్టి ఇటువంటి వాటిని కూడా మెట్ల కింద పెట్టకూడదు. ఒకవేళ మీరు ఇంట్లో ఉన్న మెట్ల కింద ఖాళీ స్థలాన్ని ఉపయోగించాలి అనుకుంటే దానిని మీరు స్టోర్ రూమ్ గా లేదా బూట్లు, చెప్పులు పెట్టుకునే ఒక స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు ఉపయోగించే కొన్ని పాత్రలు పెట్టుకోవడానికి కూడా ఈ కాది స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే చిన్న చిన్న మొక్కలు ఉన్న కుండీలను కూడా మెట్ల కింద పెట్టవచ్చు.