New Traffic Rules: ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా చేసింది. కొత్త ట్రాఫిక్ నియమాలు దేశవ్యాప్తంగా 2025 నుంచి అమలులోకి రానున్నాయి. పాత నియమాలు కొన్ని ప్రస్తుతం చాలా కఠినంగా అయ్యాయి. మనదేశంలో వేలాదిమంది ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వింటూనే ఉన్నాము. ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం. అతివేగంతో వాహనాలను నడపడం, మద్యం సేవించి వాహనాలను నడపడం అలాగే వాహనం నడుపుతున్న సమయంలో ఫోన్ మాట్లాడడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి అనేక కారణాల వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటువంటి వాటిపై ప్రభుత్వం భారీ జరిమానాలను విధిస్తుంది. ఆ ప్రస్తుతం ఈ నియమాలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసినట్లు తెలుస్తుంది. కొత్త ట్రాఫిక్ చలాన్ నియమాలు 2025 నుంచి దేశవ్యాప్తంగా అమలు లోకి రానున్నాయి. వీటిలో ఇప్పటికే ఉన్న కొన్ని పాత నియమాలు మరింత ఘటనంగా మారనున్నాయి. రోడ్డుపై వాహనం నడుపుతున్న సమయంలో ఇటువంటి తప్పులు చేయడం వలన మీకు భారీ నష్టం తప్పదు. ప్రస్తుతం అమలులోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం మద్యం తాగి వాహనం నడుపుతూ అధికారులకు పట్టుబడినట్లైతే తొలిసారి పదివేల రూపాయలు జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు.
ఇదే తప్పు పదేపదే చేస్తే రూ.15000 రూపాయల వరకు జరిమానా రెండు ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. రెడ్ లైట్ సిగ్నల్ కనిపించినప్పుడు ఆగకుండా వాహనం నడుపుతూ కనిపిస్తే మీకు రూ.5000 రూపాయలు జరిమానా విధిస్తారు. గతంలో దీనికి జరిమానా కేవలం రూ.500 రూపాయలు మాత్రమే ఉండేది. నిర్దేశించిన వేగం కంటే కూడా అతివేగంగా వాహనం నడుపుతూ కనిపిస్తే మీకు రూ.5000 రూపాయలు జరిమానా పడుతుంది. నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ వస్తువులను ట్రక్కులేదా వాణిజ్య వాహనం తీసుకొని వెళుతున్నట్లయితే రూ.20వేల రూపాయలు జరిమానా విధించబడుతుంది. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ మీరు పట్టుబడినట్లైతే మీకు రూ.5000 రూపాయలు జరిమానా పడుతుంది.