Vastu Tips: పొరపాటున కూడా ఈ దిశలలో చెప్పుల స్టాండ్ పెట్టకూడదు.. లేకపోతే చాలా పెద్ద సమస్యలు కలుగుతాయి

Vastu Tips
Vastu Tips

Vastu Tips: సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి అలాగే దిక్కులను అనుసరించి, ఇంట్లో వస్తువుల స్థానం గురించి వాస్తు శాస్త్రంలో అనేక నియమాలు చెప్పబడ్డాయి. ఏ ఏ వస్తువులు ఏ దిశలలో పెట్టుకుంటే మంచిది అనేది కూడా వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. వాస్తు శాస్త్రంలో చెప్పుల స్టాండ్ ఏ దిశలో పెట్టాలి అనే దాని గురించి కూడా చెప్పబడింది. జీవితంలో విజయం సాధించాలి అంటే ముఖ్యంగా చెప్పులే స్టాండ్ ఇంటి బయట ఏ దిశలో ఉండాలో చెప్పబడింది.

వాస్తు నియమాలను పాటించకపోతే అనేక వాస్తు దోషాలను ఎదుర్కోవలసి వస్తుంది. దీని గురించి యూపీ కి చెందిన వాస్తు శాస్త్ర పండితుడు రిషికాంత్ మిశ్రా శాస్త్రి న్యూస్ 18 తో కొన్ని విషయాలను పంచుకున్నారు. ఇంటి గుమ్మం ముందు ఉండే చెప్పుల స్టాండ్ ఇంట్లోకి ప్రతీకార శక్తిని ప్రవేశపెడుతుంది. కాబట్టి చెప్పుల స్టాండ్ ఇంటి బయట పెట్టుకోవాలి. ఇంటి బయట కూడా చెప్పుల స్టాండ్ ను సరైన దిశలో పెట్టుకోవాలి. ఇంటికి తూర్పు, ఉత్తరం, ఈశాన్యం లేదా ఆగ్నేయ దిశలలో చెప్పుల స్టాండ్ పొరపాటున కూడా పెట్టకూడదు.

పశ్చిమ లేదా వాయువ్య మూలలలో మాత్రమే చెప్పుల స్టాండ్ పెట్టుకోవాలి. లేకపోతే ఇవి మీ ఇంట్లోకి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వంటివి ఎక్కువ అవుతాయి. కొంతమంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతారు. ఇంట్లో చెప్పులు ఇంట్లోనే అలాగే బయట చెప్పులు బయటనే వేసుకున్నా కూడా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది.కాబట్టి అన్ని రకాల చెప్పులను గుమ్మం బయటనే పెట్టుకోవాలి. పూజగదికి ఆనుకొని ఎప్పుడూ కూడా చెప్పుల స్టాండ్ పెట్టకూడదు. బాల్కనీలో ఈ స్టాండ్ పెట్టుకోవచ్చు. అక్కడ కూడా పశ్చిమ, దక్షిణ లేదా వాయువ్య దిశలలో ఈ స్టాండ్ ఉండేలాగా పెట్టుకోవాలి.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now