Aadhaar: మనదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే పుట్టిన పిల్లలనుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు చేయించుకుంటారు. అయితే ఆధార్ కార్డు చేయించుకున్న తర్వాత పుట్టిన పిల్లలు అయితే ఐదు సంవత్సరాల తర్వాత అప్డేట్ చేసుకోవాలి. అదే పెద్దవాళ్లు అయితే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కార్డు ఉన్నవాళ్లు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఉచితంగా మీ వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకోవడానికి మరో రెండు రోజులలో గడువు ముగిసిపోతుంది.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బయోమెట్రిక్ మరియు జనన ఘనంగాల ఆధారంగా 12 అంకెల ప్రత్యేక నెంబర్ను కల్పిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన గుర్తింపు డాక్యుమెంట్. ఆధార్ లో ఉన్న వివరాలను మీరు ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి మీకు జూన్ 14, 2025 వరకు మాత్రమే గడువు ఉంది. మీరు ఆధార్ ను అప్డేట్ చేసుకోవడానికి మై ఆధార్ పోర్టల్ ను లాగిన్ అవ్వాలి.
ఒకవేళ మీరు గడువు ముగిసిపోయిన తర్వాత ఆధార్ కార్డులో ఉన్న వివరాలను అప్డేట్ చేయాలి అనుకుంటే మీరు రూ.50 రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మీరు దీనిని ఆధార నమోదు కేంద్రాలలో కూడా రుసుము చెల్లించే చేసుకోవచ్చు. మీరు మీ ఇంటి దగ్గర నుంచే మై ఆధార్ పోటోల్లో అప్డేట్ చేసుకోవడానికి మీరు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికార వెబ్సైట్లోకి వెళ్లి మీ ఆధార్ కార్డు నెంబరు అలాగే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ను ఓటిపితో లాగిన్ అవ్వాలి. అందులో మీ ప్రొఫైల్లో చూపించిన వ్యక్తిగత మరియు చిరునామా వివరాలను పరిశీలించుకుని ఒకవేళ అవి సరైనవి అని మీరు భావిస్తే అన్ని వివరాలు కరెక్ట్ అని ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఒకవేళ ఏవైనా వివరాలు తప్పుగా ఉన్నట్లయితే మీరు దానిని అప్డేట్ కోసం ఎంపిక చేసుకోవాలి.