Kitchen Vastu Tips: మన నిత్యజీవితంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. అయితే వాస్తు శాస్త్రం కేవలం ఇంటి నిర్మాణంలో మాత్రమే కాదు ఇంట్లో అమర్చుకునే ప్రతి వస్తువుకు కూడా కొన్ని నియమాలను సూచిస్తుంది. విరిగిపోయిన పింగాణీ కప్పులను లేదా పాత్రలు వంటివి ఇంట్లో ఎప్పటికీ ఉపయోగిచకూడదు. ముఖ్యంగా వాటిని వంట గదిలో పెట్టకూడదు. వంట గదిలో పగిలిపోయిన కప్పులు లేదా ప్లేట్లు వంటివి ఉన్నట్లయితే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింటుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కిచెన్లో మహిళలు ఎక్కువగా డబ్బాలలో మందులను ఉంచుతారు. బ్యాండేజ్ లేదా కాటన్ వంటివి కూడా వంటగదిలో ఉండే డబ్బాలలో పెట్టే అలవాటు చాలామందిలో ఉంటుంది. కానీ వీటిని ఇంట్లో వంటగదిలో పెట్టడం మంచిది కాదు అని నిపుణులు చెప్తున్నారు. జీవావరణ శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే వంత గదిలో మందులు వంటివి పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు.
ఇంట్లో అద్దం కూడా సరైన దిశలో పెట్టుకోవాలి. ఇలా అద్దాన్ని సరైన దిశలో పెట్టుకోవడం వలన ఆ ఇంట్లో అదనపు శక్తి ఏర్పడుతుంది. కానీ వంట గదిలో మాత్రం అడ్డంపెట్టినట్లయితే ఆ ఇంట్లో అనేక ఇబ్బందులు తప్పవు. ఆ ఇంట్లో అశాంతి కూడా పెరుగుతుంది. కొంతమంది తడి పిండిని ఫ్రిజ్లో పెడతారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అని నిపుణులు చెప్తున్నారు. తడి పిండిని ఫ్రిజ్లో పెట్టి ఉపయోగించడం వలన అది క్యాన్సర్కు కారణం అవుతుంది అని సైన్స్ చెప్తుంది. శని మరియు కేతువులపై కూడా తడి పిండి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.