Todays Gold Rate: భారతీయులకు ముఖ్యంగా మన దేశ మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. బంగారం ధరలో గత నాలుగు రోజుల నుంచి తగ్గుదల కనిపిస్తుంది. ఈ క్రమంలో చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి రెడీ అయ్యారు. కానీ ప్రస్తుతం వారందరికీ ఊహించని షాప్ తగిలిందని చెప్పొచ్చు. రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించి చక్రం తిప్పుతున్నారు.
గతంలో ట్రేడ్ కోర్టు సుంకాల విధింపుకు బ్రేకులు వేస్తే తాజాగా ఈ సుంకాల విధింపుకు మరొకటి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది.తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో బంగారం ధరలలో ఊహించని మార్పు చోటుచేసుకుంది. బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగినట్లు తెలుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి.
హైదరాబాద్ మార్కెట్లో కూడా ఈరోజు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారంపై ఈరోజు రూ.270 పెరిగింది. దీంతో ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం తులం రేటు రూ.97,310 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం రేటు 250 పెరిగి ప్రస్తుతం రూ.89,200 గా ఉంది. వెండి మాత్రం ఈరోజు స్థిరంగా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది.