Vastu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే పడేయండి.. లేకపోతే ఆర్థిక నష్టాలు తప్పవు

Vastu Tips
Vastu Tips

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ప్రతికూల శక్తిని కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల అభివృద్ధికి అవి నిరోధకంగా ఉంటాయి. సంపద రాకకు కూడా కొన్ని రకాల వస్తువులు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచే కొన్ని రకాల వస్తువులను తీసి బయట పడేయాలి అంటూ వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. చాలామంది తమ ఇంటి లోపల డస్ట్ బిన్ పెట్టుకుంటారు. దానిని ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో ప్రతికూల శక్తి తీసుకుని వస్తుంది.

బెస్ట్ బినా ఇంటి బయట పెట్టుకోవాలి. ఒకవేళ డస్ట్ ఇంట్లో పెట్టుకోవలసి వస్తే మూత పెట్టి పెట్టుకోవాలి. చాలామంది పాత వస్తువులను పడేయడానికి విముఖత చూపిస్తారు. విరిగిన వస్తువులను, పాత చిరిగిపోయిన బట్టలను, తుప్పు పట్టిన వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు. వీలైనంత త్వరగా అటువంటి వాటిని బయట పడేయాలి. పాత వస్తువుల మీ అభివృద్ధికి ఆటంకంగా మారుతాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ఇండోర్ ప్లాంట్స్ పెడుతున్నారు.

ఎండిపోయిన మొక్కలను ఇంట్లో పెట్టుకోకూడదు. ఒకవేళ మొక్కలు ఎండిపోయినట్లు కనిపిస్తే వెంటనే తీసివేయాలి. చాలామంది ఇంటి లోపల శుభ్రంగా ఉంచుకుంటారు కానీ ఇంట్లో కొన్ని పనికిరాని వస్తువులను పైకప్పు పై పడేస్తుంటారు. పైకప్పు పై ఉంచిన కొన్ని వ్యర్ధాలు కూడా ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి.వీటి కారణంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి పాడైపోయిన వస్తువులను ఇంటి పైకప్పు పై ఉంచకూడదు.