Gold Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా గోల్డ్ లోన్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించింది. గోల్డ్ లోన్స్ పై దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది. మనదేశంలో ఉన్న గోల్డ్ లోన్ ఇండస్ట్రీని ఎస్ ఎన్ పి గ్లోబల్ రేటింగ్స్ రిపోర్టు ప్రకారం ఈ మార్పులు జరగనున్నాయి. అన్ని బ్యాంకులలో మరియు ఇతర ఆర్థిక సంస్థలలో ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. ముఖ్యంగా వీజా బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చినా ఈ కొత్త రూల్స్ రెండు కీలకమైన మార్పులను చేపట్టింది.
బ్యాంకులు అన్నీ కూడా గోల్డ్ పై రుణం ఇస్తున్న సమయంలో లోన్ టు వ్యాల్యూ క్యాలిక్యులేషన్లో రుణం ముగిసే వరకు చెల్లించాల్సిన వడ్డీని చేరుస్తాయి. ఈ విధంగా చేయడం వలన కస్టమర్లు ముందుగా పొందే డబ్బు మొత్తం తగ్గే అవకాశం ఉంది. బంగారం పై తీసుకున్న లోన్ లో కొంత భాగాన్ని మీరు భవిష్యత్తులో వడ్డీని కవర్ చేయడానికి రిజర్వ్ చేస్తారు. అయితే బంగారంపై ఎక్కువ రుణం పొందాలి అనుకుంటున్నా వారికి ఇది అనుకూలంగా ఉండదు.
అన్ని బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు బంగారంపై 2.5 లక్షల కంటే ఎక్కువ రుణం ఇచ్చే ముందు ఆ కస్టమర్ యొక్క క్యాష్ ఫ్లో చెక్ చేయాలి. ఈ విధంగా చేయడం వలన రుణగ్రహితలు కస్టమర్ తీసుకున్నా రుణం చెల్లించగలుగుతాడా లేదా అని అంచనా వేయగలుగుతారు. రిస్క్ మేనేజ్మెంట్ సిస్టంను ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 2026 వరకు ఈ మార్పులన్నీ పూర్తిగా సర్దుబాటు చేసుకోవడానికి ఫైనాన్షియల్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమయం ఇచ్చింది. అలాగే నివేదిక ప్రకారం త్వరగా ఈ నియమాలను అడాప్ట్ చేసుకునే కంపెనీలు మెరుగ్గా పనిచేసే అవకాశం ఉందని పేర్కొంది.