Aadhaar Card: ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ అవకాశాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించినట్లు ప్రకటించింది. మీ ఆధార్ కార్డును ఎటువంటి రుసుము లేకుండా జూన్ 14, 2026 వరకు ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మీరు ఆధార్ కు సంబంధించి ఈ కేవైసీ లేదా ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేసుకోకపోతే భవిష్యత్తులో మీరు ప్రభుత్వానికి సంబంధించిన అనేక పథకాల ప్రయోజనాలను కోల్పోతారు.
ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్, గ్యాస్ సబ్సిడీ, పెన్షన్, పీఎం కిసాన్ యోజన లేదా స్కాలర్షిప్ వంటి వాటికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇటువంటి సమయంలో మీరు మీ ఆధార్ కార్డును తప్పకుండా అప్డేట్ చేసుకొని ఉండాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డు అప్డేట్ లేకపోతే మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఈ పది ముఖ్యమైన పథకాలను కోల్పోతారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎం కిసాన్ యోజన పథకంలో 2000 రూపాయలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మీ బ్యాంకు ఖాతాలో పడతాయి.
ఒకవేళ మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబరు లింక్ చేయకపోతే లేదా ఈకేవైసీ పూర్తి చేయకపోతే ఈ డబ్బులు నిలిచిపోతాయి. ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై అందిస్తున్న సబ్సిడీ కూడా నేరుగా బ్యాంకు ఖాతాలో పడతాయి. దీనికోసం కూడా ఆధార్ కార్డు తప్పకుండా లింక్ చేసుకొని ఉండాలి. రేషన్ కార్డుకు సంబంధించిన ప్రయోజనాలను పొందాలంటే కూడా తప్పకుండా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని ఉండాలి. అలాగే జాతీయ పెన్షన్ పథకాలు ఇంకా స్కాలర్షిప్ కు సంబంధించినవి పొందాలన్నా కూడా మీ ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి ఉండాలి.