Vastu Tips: చాలామందిలో పడమర దిశ శుభమా లేదా అశుభమా అనే సందేహం ఉంటుంది. మీరు ప్రస్తుతం పడమర ముఖంగా ఇంట్లో ఉంటున్నట్లయితే లేదా పడమర ముఖంలో ఇంటిని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ ఆర్టికల్ మీకోసమే. తూర్పుముఖంగా ఉండే ఇళ్లకు సాధారణంగా చాలా డిమాండ్ ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పడమర ముఖంగా ఉన్న ఇళ్లకు కూడా కొన్ని ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు లాభాలు ఉన్నాయి.
వాస్తు శాస్త్రంలో పడమర ముఖంగా ఉండే ఇల్లు గురించి కొన్ని అంశాలు పరిగణించబడ్డాయి. మామూలుగా అందరూ కూడా తూర్పుముఖంగా ఉండే ఇళ్లకు ఇచ్చే ప్రాధాన్యత పడమర ముఖంగా ఉండే ఇళ్లకు ఇవ్వరు. కానీ వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలను పాటించడం వలన పడమర ముఖంగా ఉన్న ఇల్లు కూడా చాలా శుభ ఫలితాలను కలిగిస్తాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. శని గ్రహం పడమర దిశలో పాలిస్తుంది. ఇది న్యాయానికి, క్రమశిక్షణకు ప్రతీక అని వాస్తు శాస్త్రం ప్రకారం నిపుణులు చెప్తున్నారు. వరుణ దేవుడికి ఇది షా అంకితం చేయబడింది.
వరుణ దేవుడు సంపద మరియు శ్రేయస్సున కలిగిస్తారు. ముఖ్యంగా వ్యాపారులకు, రాజకీయ నాయకులకు మరియు బోధకులకు పడమర ముఖంగా ఉండే ఇల్లు చాలా శుభ ఫలితాలను కలిగిస్తాయి. ధన లాభాలను కలిగిస్తుంది. పడమర దిశలో ఉన్న ఇంట్లో నివసించే వారికి సామాజికంగా గుర్తింపు అలాగే కీర్తి లభిస్తాయి. ఇంట్లో ఉండే పెద్ద కుమారుడికి ఈ పశ్చిమ దిశ చాలా శుభప్రదంగా చెబుతారు. అయితే పడమరదిత ఎక్కువగా వేడిని స్వీకరిస్తుంది కాబట్టి వేసవికాలంలో మాత్రం ఈ దిశలో ఉండే ఇల్లు చాలా వేడిగా ఉండే అవకాశం ఉంది. పడమర ముఖంలో ఇల్లు నిర్మించుకున్నప్పుడు వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి లేకపోతే అనేక ఆర్థిక నష్టాలు పెరిగే అవకాశం ఉంది.