Gas Cylinders: ప్రతి ఒక్కరి ఇంట్లో వంట గదిలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉంటుంది. అయితే ఇది ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది అన్న సంగతి మనలో చాలామందికి తెలియదు. ఎల్పిజి గ్యాస్ సిసిలిండర్లో పెట్రోలియం వాయువు ఉంటుంది. సిలిండర్లు అనేక రంగులలో ఇతర వాయువులతో నిండి ఉంటాయి. ఇంట్లో ఉండే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ గురించి మనలో చాలామందికి కొన్ని విషయాలు తెలియదు. మనం ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులో ఎందుకు ఉంటుందో చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఎరుపు రంగును ప్రమాదానికి చిహ్నంగా చెప్తారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిని ఆపేందుకు ఎరుపు రంగును ఉపయోగిస్తారు.
అయితే వంట గదిలో ఉన్న సిలిండర్లో పెట్రోలియం వాయువు ఉంటుంది. అలాగే వివిధ రంగులలో ఇతర వాయువులతో నిండిన సిలిండర్లు కూడా ఉంటాయి. ఎరుపు రంగు ప్రమాదానికి సంకేతం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఎల్పిజి సిలిండర్ కూడా చాలా ప్రమాదకరం కాబట్టి దీనిని ఎరుపు రంగుతో సూచిస్తారు. అందుకే ఎల్పీజీ సిలిండర్కు ఎరుపు రంగు వేస్తారు. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లోపల ఉండే వాయువు మండే స్వభావం కలది. దీనినే చాలా బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. ఒకవేళ దీనిని ఉపయోగించడంలో నిర్లక్ష్యం వహితే ప్రమాదం తప్పదు.
కాబట్టి వంట గదిలో గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వారిని అప్రమత్తం చేయడానికి గ్యాస్ సిలిండర్కు ఎరుపు రంగు వేస్తారు. ప్రజలు దీనిని సులభంగా గుర్తించగలుగుతారు. ఇక ఇతర సిలిండర్లలో సంపీడన సహజవాయువు, పైపుల ద్వారా నడిచే సహజవాయువు, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, హీలియం వంటి వాయువులను కూడా నింపుతారు. ప్రతి వాయువుకు కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అయితే తెల్లగా పెయింట్ వేసిన గ్యాస్ సిలిండర్ లో ఆక్సిజన్ వాయువు నింపుతారు. దీనిని మీరు ఆసుపత్రులలో చూడవచ్చు.
అలాగే నల్లగా పెయింట్ చేసి ఉన్న గ్యాసెస్ సిలిండర్లో నైట్రోజన్ వాయువు నిండి ఉంటుంది. పెట్రోల్ పంపులు, టైర్ ఫిల్లింగ్ వంటి దుకాణాలలో దీనిని మీరు చూడవచ్చు. గోధుమ రంగులో ఉన్న సిలిండర్లో హీలియం వాయువు నింపుతారు. దీనిని మీరు బెలూన్లలో గాలిని నింపడానికి ఉపయోగిస్తారు. ఇక లాఫింగ్ గ్యాస్ అని పిలవబడే నైట్రస్ ఆక్సైడ్ వాయువు నీలం రంగు ఉన్న సిలిండర్లో నింపుతారు. బూడిద రంగు పెయింట్ వేసిన సిలిండర్లో కార్బన్డయాక్సైడ్ వాయువు ఉంటుంది. ముఖ్యంగా ఇది కర్మాగారాలు, పరిశ్రమలలో ఉపయోగిస్తారు.