Bird Nest: ఈ పక్షి గూడు మీ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు.. అన్ని శుభాలే

Bird Nest
Bird Nest

Bird Nest: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రకృతిలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా మన జీవితానికి ఏదో ఒక రకంగా సంబంధం కలిగి ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో పక్షులు గుడు కట్టుకోవడం, పక్షుల ప్రవర్తన, అవి గూడు కట్టుకున్న స్థలం వంటివి సంకేతాలుగా చెబుతున్నారు. అయితే కొన్ని రకాల పక్షులు మరియు తేనెటీగలు ఇళ్లలో గూడు కట్టడం చాలా శుభసూచీకంగా చెప్తున్నారు. కానీ కొన్ని రకాల జంతువులు ఇళ్ళలో గూడు కట్టడం మాత్రం చాలా దురదృష్టానికి సంకేతంగా నిపుణులు చెప్తున్నారు.

శగుణ శాస్త్ర నిపుణుల ప్రకారం కొన్ని రకాల పక్షులు ఇంట్లో గూడు కట్టుకుంటే ఆ ఇంట్లో సానుకూల శక్తి వసతి స్థిరపడినట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఇళ్లలో పిట్టలు గూడు కట్టడం వలన ఆ ఇంట్లో సౌఖ్యంతో పాటు శాంతి మరియు సాంఘిక అనుబంధాలు కూడా మెరుగుపడతాయి అని నమ్ముతారు. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా ఇది సహకరిస్తుందని చాలామంది నమ్మకం. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

అలాగే ఇళ్లలో తేనెటీగల గూడు కట్టినా కూడా అది శ్రమ, క్రమశిక్షణ మరియు భాగస్వామ్య భావనకు ప్రతీకగా భావిస్తారు. ఇంట్లో తేనెటీగలు గూడు కట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత అలాగే పరస్పర సహకారం కూడా ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తేనెటీగలను లక్ష్మీదేవికి చిహ్నాలుగా కూడా భావిస్తారు. కానీ ఇళ్లలో గబ్బిలాలు మాత్రం గూడు కట్టడం చాలా అశుభంగా భావిస్తారు. ఇవి ఇంట్లో గూడు కట్టడం బలహీన సంకల్పానికి ప్రతి కదా చెప్తారు. వీటి గూడు ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కలుగుతాయి.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now