Vastu Tips: ఈ వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం కలుగుతుంది.!

Vastu Tips

Vastu Tips: చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఫాలో అయ్యి ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం అనేది కేవలం ఇంటి నిర్మాణంలో మాత్రమే కాకుండా ఇంట్లోని ప్రతి వస్తువులతో కూడా ముడిపడి ఉంటుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వలన ఆర్థిక సమస్యలు వంటివి తొలగిపోయి అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

లాఫింగ్ బుద్ధ: లాఫింగ్ బుద్ధ గురించి అందరికీ తెలిసిందే. దీనిని ఇంట్లో పెట్టుకోవడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన ప్రవాహం కలుగుతుంది. ఈ లాఫింగ్ బుద్ధ ను ఇంట్లో ఉత్తర దిక్కులో పెట్టుకోవడం వలన సంపద పెరుగుతుందని చాలామంది నమ్మకం.

ఈవిల్ ఐ లాకెట్స్: ఈ మధ్యకాలంలో ఇవి చాలా పాపులర్ అయ్యాయి. చాలామంది ఇళ్లలో ఈవిల్ ఐ లాకెట్స్ పెట్టుకుంటున్నారు. వీటిని గిఫ్ట్స్ రూపంలో ఇతరులకు కూడా ఇస్తున్నారు. వీటిని ఎక్కువగా ఆఫ్రికా, మధ్య తూర్పు దేశంలో ప్రజలు ఎక్కువగా పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టుకోవడం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.

తాబేలు: తాబేలును లేదా తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం వలన చాలా మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. ఇంట్లో తూర్పు దిక్కులో దీన్ని పెట్టుకోవడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి సంపద పెరుగుతుందని చాలామంది నమ్మకం.

ఏనుగు విగ్రహాలు: వాస్తు శాస్త్రం ప్రకారం పంచలోహాలతో చేసిన ఏనుగు విగ్రహాలు కానీ, వెండితో చేసిన ఏనుగు విగ్రహాలు గాని ఇంట్లో పెట్టుకోవడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద పెరుగుతుందని చెప్తున్నారు.