Vastu Tips: ఇంట్లో ఆనందం, సంపద అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలి అంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించాలి. ఈ నియమాలు కేవలం ఇంటి నిర్మాణం కోసం మాత్రమే కాదు ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను సరైన దిశలో పెట్టడానికి కూడా తప్పనిసరిగా పాటించాలి. కొంతమంది ఇంట్లో ఎక్కడపడితే అక్కడ డబ్బులను పెడతారు. ఇంట్లో డబ్బులు పెట్టుకునే సేఫ్లాకర్ కూడా ఎక్కడపడితే అక్కడ చాలామంది పెడుతూ ఉంటారు. అయితే డబ్బులు దాచుకునే సేఫ్ లాకర్ ని కూడా ఇంట్లో సరైన దిశలో పెట్టాలి.
లేకపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. ఆ ఇంటి నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్లిపోతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వాస్తు శాస్త్రానికి మన నిత్యజీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రంలో చెప్పబడిన నియమాలను పాటించడం వలన శుభప్రదంగా మరియు ఆనందంగా ఉంటారు. అయితే ఈ నియమాలను పాటించకపోతే మాత్రం అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. సంపద గురించి కూడా వాస్తు శాస్త్రంలో అనేక నియమాలు చెప్పబడ్డాయి. పొరపాటున కూడా ఇంట్లో డబ్బులను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు.
అలాగే డబ్బులు పెట్టే లాకర్ ని కూడా ఇంట్లో సరైన దిశలో పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో దక్షిణ దిశలో డబ్బులను పెట్టకూడదు.వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశను యమరాజు దిశగా పరిగణిస్తారు. కాబట్టి ఇటువంటి దిశలో డబ్బులను పెట్టినట్లయితే అప్పుల ఊబిలో పడిపోతారు. చీకటిగా ఉన్న ప్రదేశంలో లేదా గదిలో కూడా సేఫ్ లాకర్ ను పెట్టకూడదు. సేఫ్ లాకర్ పెట్టే స్థలం చాలా శుభ్రంగా మరియు తగినంత వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంకి సమీపంలో కూడా సేఫ్ లాకర్ పెట్టకూడదు. ఇలా పెట్టినట్లయితే ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి డబ్బు ప్రవాహం తగ్గిపోతుంది.