Vastu Tips: ఇంటి నిర్మాణం తో పాటు ఇంట్లోనే కొన్ని వస్తువులను సరైన దిశలో పెట్టడానికి కూడా వాస్తు శాస్త్రంలో అమలు చెప్పబడ్డాయి. ఇంట్లోనే వస్తువులు సరైన దిశలో లేకపోతే ఆ ఇంట్లో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో చాలామంది వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. అయితే ఇంట్లో డైనింగ్ టేబుల్ ఏ దిశలో పెట్టుకోవాలో చాలామందికి తెలియదు. వాస్తు శాస్త్రంలో ప్రతి వస్తువు కూడా ఇంట్లో ఒక స్థిర స్థానం కలిగి ఉంటుంది అని చెప్పబడింది. వీటికి సంబంధించి కొన్ని నియమాలు కూడా వాస్తు శాస్త్రంలో ఉన్నాయి.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజు భోజనం చేసే డైనింగ్ టేబుల్ ఇంట్లో సరైన దిశలో ఉండాలి. భోజనం చేసే గదిని ఎప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో మాత్రమే ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఇంట్లో డైనింగ్ టేబుల్ తూర్పు దిశలో ఉన్నట్లయితే ఆ ఇంటి కుటుంబ సభ్యులు అనేక నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ దిశలో కూర్చొని డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసేవారి దృష్టి మొత్తం తినే ఆహారం రుచి పైన ఉంటుందని చెప్తున్నారు. అంటే వాళ్ళు పోషకాహారం కంటే కూడా ఎక్కువగా రుచి మీద దృష్టి పెడతారు. వివిధ రకాల ఆహారము తినాలి అనుకునే కోరిక కూడా వాళ్లలో పెరుగుతుంది.
ఇంట్లో డైనింగ్ టేబుల్ తూర్పు ఆగ్నేయ దశలో పెట్టుకోవడం వలన తినాలనుకునే కోరిక తగ్గుతుంది అని నిపుణులు చెప్తున్నారు. వాళ్లు అసౌకర్యంగా భావిస్తారు. ఒకవేళ డైనింగ్ టేబుల్ ఇంట్లో నైరుతి దిశలో ఉన్నట్లయితే ఆ టేబుల్ ని ఉపయోగించడానికి ఆసక్తి చూపించారు. ఇంట్లో ఆహారం తినడానికి కూడా ఆసక్తి చూపించరు. కాబట్టి ఇంట్లో డైనింగ్ టేబుల్ పశ్చిమ, వాయువ్య లేదా ఈశాన్య దిశలో మాత్రమే పెట్టుకోవాలి. డైనింగ్ టేబుల్ మీద మీరు అలంకరణ కోసము ఒక బుట్ట పండ్లు, పువ్వులు లేదా ఇతర వస్తువులను పెట్టుకోవచ్చు. కానీ డైనింగ్ టేబుల్ చుట్టూ నిస్తేజంగా ఉన్న వస్తువులను పెట్టకూడదు అని నిపుణులు చెప్తున్నారు. డైనింగ్ టేబుల్ గుండ్రంగా కానీ ఓవల్ ఆకారంలో కానీ పెట్టుకోవచ్చు.