Vastu Tips: చాలామంది తమ ఇళ్లలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుతారు. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని చాలామంది నమ్మకం. కానీ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క సరైన దిశలో పెట్టకపోతే మాత్రం అనేక ఇబ్బందిలను ఎదుర్కోవలసి వస్తుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు గ్లాస్ బాటిల్ లో మనీ ప్లాంట్ మొక్కను పెట్టినట్లయితే ఆ నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అలాగే ఆ మొక్క ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోవాలి. ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఎండిపోయినట్లయితే ఆ ఇంట్లో సుఖసంతోషాలకు ఇబ్బందులు ఏర్పడవచ్చు.
మనిషి జీవితంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చాలామంది వాస్తు శాస్త్రాన్ని కేవలం ఇంటి నిర్మాణంలో మాత్రమే కాకుండా ఇంట్లో అమర్చి కూడా ప్రతి వస్తువు విషయంలో కూడా అలాగే ప్రతి మొక్కల విషయంలో కూడా నియమాలు పాటిస్తారు. కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వాస్తు శాస్త్రం ప్రకారం చాలా శుభప్రదంగా చెప్తారు. అటువంటి మొక్కలలో మనీ ప్లాంట్ మొక్క కూడా ఒకటి. ఇళ్లలో లేదా కార్యాలయాలలో మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకుంటారు. అయితే మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన మంచి మరియు చెడు ఫలితాలు కూడా ఉంటాయి.
సరైన దిశలో మాత్రమే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కలు పెట్టుకోవాలి లేకపోతే చెడు ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇంటి ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెట్టకూడదు. ఈ విధంగా చేస్తే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్క పెంచాలి. అలాగే ఈ మొక్క ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోవాలి. కొన్ని ఆకులు కూడా ఎండిపోయినట్లు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించాలి. మనీ ప్లాంట్ మొక్క తీగ నేలకు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ ఫ్రీగా నేలకు తాకినట్లు కనిపిస్తే దానిని వెంటనే దారంతో పైకి కట్టాలి. పచ్చి పాలను నీటిలో కలిపి శుక్రవారం రోజున మనీ ప్లాంట్ మొక్కలో పోస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మనీ ప్లాంట్ మూలానికి దగ్గరగా దారాన్ని కట్టినట్లయితే ఇంట్లో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.