Vastu Tips: ఇంట్లో ఈ వాస్తు దోషాలు ఉంటె చాల ప్రమాదం..ఈ జాగ్రత్తలు పాటించండి.!

Vastu Tips
Vastu Tips

Vastu Tips: ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొన్న దగ్గర నుంచి ఇల్లు నిర్మించుకునే వరకు మొత్తం వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు చాల మంది.అయితే కొన్ని కొన్ని సార్లు తెలియక చేసే కొన్ని తప్పుల వలన ఇంట్లో ఉండే వాళ్ళ మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.తెలియక చేసే కొన్ని తప్పుల కారణంగా వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం ఎలా ఉండాలి..ఒకవేళ వాస్తు ప్రకారం లేకపోతె ఎలాంటి ప్రతికూల ప్రభావం పడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

చాల మంది వాస్తు శాస్త్రాన్ని బాగా విశ్వసిస్తారు.అందుకే ఇల్లు నిర్మించుకునేటప్పుడు వాస్తు ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.చాల మంది వాస్తును విశ్వసించే వారు వాస్తు పండితులను సంప్రదించి వారి అభిప్రాయం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటారు.అలా యెంత జాగ్రత్తగా వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకున్న కూడా తెలియక చేసే కొన్ని తప్పుల వలన ఇంట్లో వాస్తు దోషం ఏర్పడే ప్రమాదం ఉంది.ముఖ్యంగా ఇంటికి తూర్పు దిశలో చెత్తను వేస్తె దరిద్రం ఏర్పడుతుంది.అందుకే ఇంటి తూర్పు దిశలో చెత్త లేకుండా చూసుకోవాలి.

Also Read: ఈ వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం కలుగుతుంది.!

అలాగే తూర్పు దిశలో చెట్లు ఉన్నట్లయితే అవి ఇంటి కంటే ఎక్కువ ఎత్తులో ఉండకుండా చూసుకోవాలి.ఇంట్లో తూర్పు దిశలో బరువైన వస్తువులు లేకుండా చూసుకోవాలి.లేకపోతె ఇంట్లో తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి.ఇంట్లో ఆగ్నేయ దిశా మిగిలిన అన్ని దిక్కులా కంటే ఎత్తుగా లేకుండా ఉండాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు.ఇలా ఉన్నట్లయితే ఇంట్లో అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.దక్షిణ దిశలో బోర్ ఉండకుండా చూసుకోవాలి.దీనివలన కూడా వాస్తు దోషం ఏర్పడుతుంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ నైరుతి దిశకు సమీపంలో తలుపు ఉండకుండా చూసుకోవాలి.లేకపోతె ప్రమాదాలను ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుంది అని నిపుణులు చెప్తున్నారు.ఈశాన్య దిశలో కొంత ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి.తూర్పు దిశా నుంచి ఇంట్లోకి గాలి,వెలుతురూ వచ్చేలా చూసుకోవాలి.తలుపుల విషయంలో కూడా వాస్తు చిట్కాలను పాటించాలి.ఒక తలుపు మరొక తలుపుకు ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి.అలాగే మెట్లు తూర్పు ఆగ్నేయంగా లేదా ఉత్తర వాయువ్యంగా ఉండేలా చూసుకోవాలి అని నిపుణులు చెప్తున్నారు.

Also Read: నల్ల దారాన్ని ఏ రోజున ఏ కాలికి కట్టుకోవాలో తెలుసా…అసలు నల్ల దారాన్ని కట్టుకోవడం ఏం జరుగుంతుందో తెలుసా.!