Gangotri Child Artist: సినిమా పరిశ్రమలో చాల మంది చిన్నారులు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఆ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన చిన్నారులలో కావ్య కూడా ఒకరు.కావ్య పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు అంతగా గుర్తుపట్టలేరు కానీ గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట చిన్నారి అంటే బాగా గుర్తుపట్టగలరా తెలుగు సినిమా ప్రేక్షకులు.దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వందవ చిత్రంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్,అతిథి అగర్వాల్ జంటగా నటించారు.
అల్లు అర్జున్ (Allu Arjun) కూడా గంగోత్రి సినిమా తోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు.అయితే గంగోత్రి సినిమాలో తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో వల్లంకి పిట్ట పాటలో కనిపించిన చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాల కోసం ట్రై చేస్తుంది.గంగోత్రి సినిమా వచ్చినప్పుడు కావ్య కు నాలుగు సంవత్సరాలు.ఇప్పుడు 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత చదువు పూర్తి చేసుకొని ఇప్పుడు హీరోయిన్ కావడానికి ఆడిషన్స్ కూడా ఇస్తుంది కావ్య.
అశ్వనీదత్ మరియు అల్లు అరవింద్ నిర్మించిన గంగోత్రి చిత్రం కావ్య కు మంచి పేరు తీసుకొచ్చింది.ఘన విజయం సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయినా గంగోత్రి చిత్రానికి కీరవాణి సంగీతం అందించడం జరిగింది.ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాల కోసం ట్రై చేస్తున్న కావ్య లేటెస్ట్ ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.మరి వల్లంకి పిట్ట చిన్నారి హీరోయిన్ గా ఏ సినిమా తో ఎంట్రీ ఇస్తుందో వేచి చూడాల్సిందే.
View this post on Instagram