Lizards: ఇంట్లో ఉండే బల్లులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇంటి నుంచి బల్లులను ఎలా వదిలించుకోవాలో అని చాలామంది గూగుల్ లో తెగ గాలిస్తూ ఉంటారు. ఇటువంటి వారి కోసం ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ చందా మరియు ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఒక వీడియో షేర్ చేయబడింది. దీనికి మీకు కేవలం మూడు అంశాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న కీటకాల భయం ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి లోపల ఇవి ఉంటే వాటిని తరిమికొట్టడానికి చాలా ఇబ్బందులు పడతారు. అన్ని సీజన్లో కూడా ఇవి ఇంట్లో పెద్ద సమస్యగా ఉన్నాయి. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఇంట్లో బల్లుల సమస్య మాత్రం తీరడం లేదు.
ఇవి ఇంట్లో అపరిశుభ్రత ఒక కారణం అవుతాయి. చాలామందికి బల్లులు అంటే చాలా భయం. వీటిని ఇంటి నుంచి తరిమి కొట్టడానికి ఎన్నో ఖరీదైన స్ప్రేలు మరియు పురుగుల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్ని సహజ పద్ధతులను పాటించి కూడా ఇంటి నుంచి వీటిని తరిమికొట్టవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే సహజమైన పద్ధతి సామాజిక మాధ్యమాలలో చాలా వైరల్ అవుతుంది. దీనికోసం మీకు ఉల్లిపాయ రసం, పత్తి మరియు సేఫ్టీ పిన్ ఉంటే సరిపోతుంది. ముందుగా మీరు కాటన్ తీసుకొని దానితో చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేయాలి.
ఈ బాల్స్ ను మీరు ఉల్లిపాయ రసంలో ముంచి ఆ తర్వాత వాటిని సేఫ్టీ దారం కట్టాలి. ఈ పిన్ మీరు బల్లులు ఎక్కువగా ఉన్న చోట పెట్టాలి. ఉదాహరణకు చెప్పాలంటే మీరు వంటగదిలో ఉన్న ఒక మూలలో ఒక చిన్న మేకుకు ఈ పిన్ వేలాడదీయవచ్చు. అల్మారా దగ్గర కూడా ఈ పిన్ పెట్టవచ్చు. కిటికీల గుమ్మము లేదా తలుపుల పైన మీద కూడా దీనిని పెట్టవచ్చు. ఉల్లిపాయల ఘాటైన వాసన బల్లులకు ఇష్టం ఉండదు. ఈ వాసనకు అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఈ సహజమైన పద్ధతి విషపూరితం కాదు. ముఖ్యంగా బల్లులు ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్ మరియు బలమైన వాసన కారణంగా బయటకు పారిపోతాయి.
View this post on Instagram