PAN Card: పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి హెచ్చరిక…పాన్ కార్డు ఇలా వాడితే రూ.10 వేలు జరిమానా చెల్లించాలి

PAN Card
PAN Card

PAN Card: మన దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు ఉంటుంది. అయితే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు మీరు మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకుండా ఫైనాన్షియల్ లావాదేవీల కోసం ఉపయోగిస్తున్నట్లయితే ఆదాయపు పన్ను శాఖలో ఉన్న శిక్షణ 272 బి కింద మీరు కొన్ని తీవ్రమైన పరిమాణాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి.

ఇలా చేసుకోకపోతే భవిష్యత్తులో వాళ్ల పాన్ కార్డు పనిచేయదు. ఇప్పటివరకు పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ చేయకుండా మీరు లావాదేవీలు చేసినట్లయితే ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న సెక్షన్ 272 బి కింద మీరు తీవ్ర పరిణామాలను కూడా ఎదుర్కోవాలి. ఈ విధంగా చేసిన ప్రతి లావాదేవీ కి మీరు 10 వేల రూపాయల వరకు ఫైన్ చెల్లించాలి. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే ఇకపై పాన్ కార్డు పనిచేయదు. పాన్ కార్డు పనిచేయకపోవడం వలన మీ ఫైనాన్షియల్ మరియు టాక్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇకపై చెల్లవు.

ఇటువంటి మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు చేస్తున్న సమయంలో ఆధార్ కార్డు తొలగించేయని పాన్ కార్డును ఉపయోగిస్తున్నట్లయితే మీకు పెనాల్టీ విధిస్తారు. ముఖ్యంగా మీరు బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తున్న సమయంలో కూడా ఇన్ ఆపరేటివ్ పాన్ కార్డును ఉపయోగించకూడదు. ఏవైనా ఆస్తులు కొనుగోలు చేయడానికి లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి, లోన్ కోసం దరఖాస్తు చేయడానికి కూడా ఇటువంటి ఇన్ ఆపరేటివ్ పాన్ కార్డును వాడకూడదు. ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత కూడా మీకు అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇన్ ఆపరేటివ్ పాన్ కార్డును మీరు ఉపయోగించిన ప్రతిసారి ప్రతి లావాదేవీకి కూడా పదివేల రూపాయలు జరిమానా చెల్లించాలి.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now