Turmeric Powder: పసుపు వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణాశయానికి పసుపు ఎంతో మేలు చేస్తుంది. చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా పసుపు బాగా సహాయపడుతుంది. అలాగే మెదడుకు కూడా పసుపు చాలా ఉపయోగపడుతుంది. అన్ని రకాల వంటల్లో పసుపు కీలకపాత్రను పోషిస్తుంది. ఇది టేస్ట్ తో పాటు వంటలకు మంచి కలర్ను కూడా ఇస్తుంది.
చాలామంది అన్ని రకాల వంటల్లో పసుపుని వేస్తుంటారు. కానీ కొన్ని వంటలలో పసుపు వేయకూడదు అన్న సంగతి చాలామందికి తెలియదు అని చెప్పొచ్చు. మెంతికూర వండేటప్పుడు పసుపు వేయకూడదు అంట. ఎందుకంటే మెంతికూర కూడా కాస్త చేదుగా ఉంటుంది అలాగే పసుపు కూడా చేదుగా ఉంటుంది. మెంతికూరలో పసుపు వేసి వండడం వలన ఆ కూర టేస్ట్ తగ్గిపోతుందని తెలుస్తుంది. ఆవపిండి ఆకుకూర చాలామంది తింటుంటారు.
ఆవాకుల్లో ఆస్ట్రిజంట్ ఉంటుంది అలాగే పసుపులో కూడా ఉంటుంది. ఈ రెండు కలిపి వండడం వలన కూర రుచి మారిపోతుంది. అలాగే పాలకూర వండేటప్పుడు కూడా అందులో పసుపు వేయకూడదు. పాలకూరలో పసుపు వేసి వండినట్లయితే రుచి మారిపోవడంతో పాటు కూర కూడా నల్లగా తయారవుతుంది. స్ప్రింగ్ ఆనియన్స్ను చాలామంది కూర చేసుకుని తింటున్నారు. వీటిలో పసుపు వేసి ఉండితే కూర మొత్తం చెడిపోతుంది. అలాగే వంకాయ కర్రీ వండేటప్పుడు కూడా అందులో పసుపు వేయకూడదు. పసుపు వేయడం వలన వంకాయ కూర చేదుగా అనిపిస్తుంది.