Keerthy Suresh: సౌత్ ఇండియాలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరు. కీర్తి సురేష్ (Keerthy Suresh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలనటిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కీర్తి సురేష్ నేను శైలజ అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఈమె తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళం లో కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. తాజాగా కీర్తి సురేష్ బేబీ జాన్ అనే సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. సినిమాలో కీర్తి సురేష్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కు జంటగా నటించింది.
టాలీవుడ్లో కీర్తి సురేష్ పలు సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఇప్పటివరకు కీర్తి సురేష్ చేసిన సినిమాలలో మహానటి సినిమాకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. సీనియర్ హీరోయిన్ సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది. ఈ సినిమాకు గాను ఆమె జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇక ఇటీవల నటి కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ (Antony Thattil) నీ పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ 12వ తరగతి నుంచి వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు తెలిపింది. దాదాపు 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ డిసెంబర్ 12, 2024న బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరిద్దరికి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఆంటోనీ నాకంటే ఏడేళ్లు పెద్దవాడని, నేను కాలేజీ చదువుతున్న సమయంలో తను ఖతార్లో ఉద్యోగం చేసేవాడు అంటూ కీర్తి సురేష్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.