Vishal: మదగదరాజా ఆడియో లాంచ్ లో పాల్గొన్న విశాల్… విశాల్ ను చూసి అందరూ షాక్..ఇలా అయిపోయాడు ఏంటి.!

Vishal
Vishal

Vishal: పందెంకోడి సినిమా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు హీరో విశాల్. ఈ సినిమాతో ఆయనకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత విషయాలు చేసిన ప్రతి సినిమా కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా రిలీజ్ అయింది. అయితే హీరో విశాల్ (Hero Vishal) సినిమాలో ఎంత ఎనర్జిటిక్ గా ఉంటాడో బయట కూడా అలాగే ఉంటాడు అని మనందరికీ తెలుసు. కానీ కొన్ని రోజుల నుంచి విశాల్ నిలబడలేనంత వీక్ గా కనిపిస్తున్నాడు.

దాంతో మా హీరో విషయాలకు ఏమయ్యింది అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి హీరో విశాల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఈయన మదగదరాజా (Madha Gaja Raja) ఆడియో లాంచ్ కు వచ్చారు. సుందర్ సి వహించిన ఈ సినిమా 12 ఏళ్ల క్రితమే రిలీజ్ కావాల్సింది. కానీ అనుకొని కొన్ని కారణాల వలన సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో హీరో విశాల్ కి జోడిగా అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఈ సినిమా ఆడియో లాంచ్ కు వచ్చిన హీరో విషయాలను చూసి అందరూ షాక్ అవుతున్నారు. వణుకుతూ మాట్లాడడమే కాకుండా కనీసం నిలబడడానికి శక్తి కూడా లేని విశాల్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే హీరో విశాల్ హై ఫీవర్ కారణంగా అలా ఉన్నారు అంటూ ఇప్పటికే పలు వార్తలు వినిపించాయి.