Chandramukhi Child Artist: హీరో రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఇప్పటికి ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.అప్పట్లో ఈ సినిమాలోని అన్ని పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి.ఇక ఈ సినిమాలోని అత్తిందోమ్ అనే పాట అందరికి ఇప్పటికి బాగా గుర్తుంటుంది.ఈ పాటలో హీరో రజనీకాంత్ తో పాటు ఒక చిన్నారి కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పచ్చు.త్వరలో చంద్రముఖి 2 రిలీజ్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ క్రమంలో చంద్రముఖి సినిమాలో నటించిన ఈ చిన్నారిని గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు.ప్రస్తుతం ఈ చిన్నారి ఎలా ఉంది ఏం చేస్తుంది అనే దాని గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.
చంద్రముఖి సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నారి పేరు ప్రహర్షితా శ్రీనివాసన్.ఈ చిన్నారి చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల లోను మరియు సీరియల్స్ లోను నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో ఉన్న ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో చంద్రముఖి సినిమా కూడా ఒకటి.పి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2005 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో జ్యోతిక,నయనతార,ప్రభు,వడివేలు,నాజర్ కీలక పాత్రలలో నటించడం జరిగింది.
ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 రిలీజ్ కు రెడీ గా ఉంది.ఈ సీక్వెల్ లో లారెన్స్,కంగనా రనౌత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో చంద్రముఖి సినిమాలో నటించిన చిన్నారి ప్రహర్షితా ను గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు.2021 లో పెళ్లి చేసుకున్న ప్రహర్షితా గత ఏడాది ఒక పాపకు జన్మనిచ్చింది.ప్రహర్షితా 18 ఏళ్ళు నటనకు దూరంగా ఉన్న తర్వాత ఒక తమిళ్ సీరియల్ లో నటించనుంది.
ఇక సినిమాలకు సీరియల్స్ కు దూరంగా ఉన్నప్పటికీ ప్రహర్షితా తన భర్త పాపతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది.తాజాగా ప్రహర్షితా తాను చంద్రముఖి సినిమాలో చిన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉన్నానో అని తెలియజేస్తూ ఒక వీడియొ ను షేర్ చేయడం జరిగింది.ఈ వీడియొ లో ఎంతో అందంగా కనిపిస్తున్న ప్రహర్షితా ను చూసి నెటిజన్లు హీరోయిన్ గా ట్రై చేయచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.