Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎటువంటి బ్యాక్ గ్రౌంగ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు చిరంజీవి.ఇప్పటి వరకు చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు.ఇప్పుడున్న హీరోలకు కూడా గట్టిగా పోటీనిస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నారు చిరంజీవి.అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాల మంది సెలెబ్రెటీల కు సంబంధించిన రేర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక ఇదే క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కు సంబంధించిన ఇప్పటి వరకు ఎవరు చూడని రేర్ ఫోటోలు వైరల్ అయ్యాయి.
అలా వైరల్ అయినా చిరంజీవి ఫోటోలలో ప్రస్తుతం ఒక ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.ఆ ఫొటోలో చిరంజీవి కేక్ కట్ చేస్తుంటే పక్కనే ఒక అబ్బాయి ఉన్నాడు.ఆ అబ్బాయి ఎవరు అనేది ప్రస్తుతం నెటిజన్లు చర్చించుకుంటున్నారు.ఇంతకూ ఆ అబ్బాయి ఎవరు అని అనుకుంటున్నారా..అవును మీరు గెస్ చేసింది కరెక్ట్..ఆ అబ్బాయి ఎవరో కాదు చిరంజీవి గారి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు.
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తన కంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అన్నయ్య కేక్ కట్ చేస్తున్న రేర్ ఫోటోను షేర్ చేసారు.ఇక ఈ ఫోటో ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది.ఇది ఇలా ఉంటె ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరియు మరోపక్క రాజకీయాలతో బిజీ గా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.