Ayesha Takia: పూరి జగన్నాధ్,నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన హిట్ సినిమా సూపర్.అప్పట్లో ఈ సినిమాలో హీరో నాగార్జున లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాతోనే అనుష్క శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.ఈ సినిమాలో హీరో నాగార్జున కు జోడిగా నటించిన బాలీవుడ్ బ్యూటీ అయేషా టాకియా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది.ఈ సినిమాలో అయేషా టాకియా తన అందంతో నటనతో అప్పట్లో కుర్రాళ్ళ మనసులో సెగలు రేపింది.అయితే అయేషా టాకియా అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ సూపర్ సినిమాలో నాగార్జున హీరోయిన్ అంటే మాత్రం ప్రేక్షకులు బాగా గుర్తుపట్టగలరు.
సూపర్ సినిమా తర్వాత అయేషా మరొక తెలుగు సినిమాలో నటించలేదు.హిందీ లో మాత్రం ఈ బ్యూటీ టార్జాన్,సోచా నా తా,వాంటెడ్,పాఠశాలా వంటి పలు సూపర్ హిట్ సినిమాలలో నటించింది.ఆ తర్వాత ఆమెకు అన్ని ప్లాప్ లే ఎదురయ్యాయి.దాంతో సినిమా అవకాశాలు తగ్గిపోవడం తో అయేషా ఫర్హాన్ అజ్మీ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపొయింది.
శుక్రవారం రోజు ఈ బ్యూటీ విమానాశ్రయం లో తన కొడుకు తో కనిపించింది.ఇక చాల కాలం తర్వాత అయేషా టాకియా కనిపించడంతో ఆమెను ఫోటోలు తీసేందుకు అందరు ఎగబడ్డారు.అయేషా తన కుమారుడు మైఖేల్ తో విమానాశ్రయం లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలను చుసిన నెటిజన్లు చాల కాలం తర్వాత మిమ్మల్ని చూడడం చాల ఆనందం గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram