Tollywood: సినిమా రంగంలో అతి చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కేవలం 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని 20 ఏళ్లకే తల్లి కూడా అయింది. ఆ తర్వాత విడాకులు తీసుకుని భర్త నుండి విడిపోయింది. వెండితెరపై తన నటన తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి తన వ్యక్తిగత జీవితంలో మాత్రం మానసిక సంఘర్షణకు గురైంది. 18 ఏళ్లకే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె ఒక కూతురు పుట్టిన తర్వాత తన భర్తతో విడాకులు తీసుకుంది.
ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్న ఆ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. వ్యక్తిగత జీవితంలో రెండుసార్లు విడాకులు తీసుకున్న ఈమె ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు బుల్లితెర నటి శ్వేతా తివారి. కసౌటీ జిందగీకి అనే హిందీ సీరియల్ లో ఈమె ప్రధాన పాత్రలో నటించింది. ప్రేరణ శర్మ అనే పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. బిగ్బాస్ సీజన్ 4 లో పాల్గొన్న శ్వేతా తివారి టైటిల్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుసగా సీరియల్స్ మరియు సినిమాలతో బిజీగా ఉంది. అయితే కొన్ని నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ. 81 కోట్లు ఉంటాయని సమాచారం.
View this post on Instagram