Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా గేమ్ చేంజర్ (Game Changer) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు టీజర్ అన్నీ కూడా బాగా పాపులర్ అయ్యి ప్రేక్షకులలో భారీగా అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ జనవరి రెండున రిలీజ్ అవుతుంది. సినిమా యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
తాజాగా గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో రామ్ చరణ్ (Ram Charan) బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో (Unstoppable Show) పాల్గొన్నారు. నిన్న ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని సమాచారం. రామ్ చరణ్ తో పాటు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ శర్వానంద్, నిర్మాత విక్రం రెడ్డి కూడా ఈ షోలో సందడి చేశారు.
ఈ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ షోలో రామ్ చరణ్ బ్లాక్ కలర్ హూడి లో కనిపించారు. బ్లాక్ కలర్ తో చేతుల మీద వైట్, రెడ్ కలర్స్ లో డిజైన్ తో ఉన్న ఈ హూడి ధర గురించి తెలుసుకోవడానికి ఫాన్స్ బాగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ధరించిన అమీరి బ్రాండ్ హూడి ధర ఒక లక్ష పదివేలకు పైగా ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.