Chiyaan Vikram Son: తండ్రి లాగానే స్టైలిష్ గా ఉన్న చియాన్ విక్రమ్ కొడుకు కూడా ఒక స్టార్ హీరో…ఎవరో తెలుసా…!

Chiyaan Vikram Son: తమిళ్ స్టార్ హీరో అయినా చియాన్ విక్రమ్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఫాలోయింగ్ ఉన్నాయి.ఆయన నటించిన అపరిచితుడు,మల్లన్న సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి.తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈయన పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నారు.తాజాగా ఈయన నటించిన పోనియెన్ సెల్వం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించారు.57 వయస్సులో కూడా విక్రమ్ స్టైలిష్ లుక్ లో ఇప్పటి కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు.ఇటీవలే జరిగిన ఈ సినిమా ప్రమోషన్ లో సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు విక్రమ్.ప్రస్తుతం తంగాలం చిత్రంలో నటిస్తున్న విక్రమ్ తాజాగా ఈ షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కూడా కోలీవుడ్ లో స్టార్ హీరో.ధృవ్ విక్రమ్ గుడ్ నైట్ చార్లీ అనే షార్ట్ ఫిలిం ను రూపొందించటం జరిగింది.ఆ తర్వాత తెలుగులో సూపర్ హిట్ అయినా అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా తమిళ్ లో హీరో గా ఎంట్రీ ఇచ్చారు ధృవ్ విక్రమ్.2019 లో రిలీజ్ అయినా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.మొదటి సినిమాతోనే విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు ధృవ్ విక్రమ్.

Leave a Comment