RRR Malli: దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ (RRR) సినిమా హిట్ తర్వాత మహేష్ బాబు సినిమా పనిలో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ప్రేక్షకులలో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు అన్న సంగతి తెలిసిందే. పాన్ గ్లోబల్ లెవెల్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం.
ఇది ఇలా ఉంటే రాజమౌళి ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) ఎంతో అద్భుతంగా నటించారు. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. హాలీవుడ్ దర్శకులు సైతం ఈ సినిమాకు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో మల్లి పాత్ర కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గోల్డ్ పిల్లల నటించినా మల్లి పాత్ర సినిమాను ప్రధాన మలుపు తిప్పింది.
మల్లి పాత్రలో కనిపించిన ఈ అమ్మాయి పేరు ట్రింకిల్ శర్మ. డాన్స్ ఇండియా షో ద్వారా ట్వింకిల్ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె చాలా టీవీ షోలు, డాన్స్ షోలతోపాటు ఫ్లిప్కార్ట్ యాడ్లో కూడా కనిపించింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా స్టార్ట్ అయినప్పుడు ట్వింకిల్ 8వ తరగతి చదువుతుందట. ఇక ఈ సినిమా పూర్తయ్యేసరికి` ఆమెది ఇంటర్ పూర్తయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి రెండేళ్లు అయింది. ప్రస్తుతం ట్వింకిల్ ఎలా ఉందో అని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ గా దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram