Vijay Sethupathi: వర్సటైల్ ఆక్టర్ గా పేరుతెచ్చుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క విలన్ కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు.తమిళ్ తో పాటు తెలుగు,హిందీ భాషలలో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు విజయ్ సేతుపతి.ఈయన ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు.పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన విజయ్ సేతుపతి తెన్మేర్కు పరువాకత్రు అనే తమిళ్ సినిమాతో హీరోగా సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.విజయ్ సేతుపతి తమిళ్ తో పాటు తెలుగు,మలయాళం,హిందీ లో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించారు.ఈయన నటించిన పిజ్జా సినిమా మంచి హిట్ అందుకుంది.
పిజ్జా సినిమా ఈయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.ఒక పక్క నటుడిగా రాణిస్తూనే మరోపక్క విజయ్ సేతుపతి తమిళ్ లో నిర్మాతగా,స్క్రీన్ ప్లే రచయితగా,గాయకుడిగా,పాటల రచయితగా కూడా కొన్ని సినిమాలకు పని చేసారు.హీరోగానే కాకుండా విలన్ గా కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు విజయ్ సేతుపతి.ఆయన తెలుగు లో 2019 లో మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాతో టాలీవడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఉప్పెన సినిమాలో రాయణం పాత్రలో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.ఈ సినిమా 2021 లో రిలీజ్ అయ్యింది.హిందీలో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు విజయ్ సేతుపతి.
విజయ్ సేతుపతి హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో విలన్ పాత్రలో బాగా మెప్పించారు.అలాగే మేరీ క్రిస్మస్ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించారు.తన నటనతో వర్సటైల్ ఆక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి.అయితే ఈయన సోషల్ మీడియా మాధ్యమాలలో మాత్రం పెద్దగా ఆక్టివ్ గా ఉండరు అని చెప్పచ్చు.తన లేటెస్ట్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను మాత్రం అడపాదడపా ఇస్తూ ఉంటారు.విజయ్ సేతుపతి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కేవలం ఒకే ఒక హీరోయిన్ ను ఫాలో అవుతున్నారు.
అయితే ఆ హీరోయిన్ ఎవరు అని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.ఆమె ఎవరో కాదు తెలుగు హీరోయిన్ అంజలి.అంజలి తెలుగుతో పాటు తమిళ్ లో కూడా వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.ఇక విజయ్ సేతుపతి,అంజలి కలిసి ఐరావి,సింధుబాద్ సినిమాలలో నటించారు.ప్రస్తుతం ఈమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చెంజర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుందని సమాచారం.ఈమె ఒక పక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
View this post on Instagram