Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య తాజాగా హీరోయిన్ శోభిత ధూళిపాళ ను పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.డిసెంబర్ 4 వీరిద్దరూ మూడు ముళ్ల బంధం తో ఒక్కటి అయ్యారు.హీరోయిన్ సమంత తో విడాకులు తీసుకోని విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభిత తో ప్రేమలో పడ్డారు.ఇక ఈ ఏడాది ఆగష్టు 8 న బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట తాజాగా పెళ్లి పీటలెక్కారు.సమంత తో విడిపోయిన తర్వాత చైతన్య వరుస సినిమాలు చేస్తూ బిజీ గా మారిపోయారు.ఇక సమంత ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉంటే నాగ చైతన్య,శోభిత పెళ్లి డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో కొద్దిపాటి బంధువులు,స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.వీరి వివాహానికి కొద్దీ మంది సినిమా సెలెబ్రెటీలు మాత్రమే హాజరయ్యారు.కాగా తాజాగా నాగ చైతన్య ఒక హీరోయిన్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రానా దగ్గుపాటి హోస్ట్ గా చేస్తున్న ఒక షో కు తాజాగా నాగ చైతన్య రావడం జరిగింది.రానా కుటుంబ సభ్యులు కూడా ఈ షో లో హాజరయ్యారు.ఈ టాక్ షో లో పలు సరదా ముచ్చట్ల గురించి మాట్లాడిన నాగ చైతన్య ఒక హీరోయిన్ అంటే మాత్రం తనకు వణుకు అని చెప్పుకొచ్చారు.
ఆ హీరోయిన్ మరెవరో కాదు లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.మొదటి సినిమాతోనే తన నటనతో,అందంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది ఈ అమ్మడు.ఇక సాయి పల్లవి డాన్స్ గురించి మాత్రం ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నాగ చైతన్య,సాయి పల్లవి కలిసి లవ్ స్టోరీ సినిమాలో నటించారు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ప్రస్తుతం వీరిద్దరూ కలిసి తండేల్ సినిమాలో నటిస్తున్నారు.రానా టాక్ షో లో సాయి పల్లవి గురించి మాట్లాడుతూ నాగ చైతన్య సాయి పల్లవితో నటించాలన్న,ఆమెతో డాన్స్ చేయాలన్న వణుకు అని సరదాగా చెప్పుకొచ్చారు.అలాగే చై రానా తో మాట్లాడుతూ నువ్వు కూడా సాయి పల్లవి తో సినిమా చేసావ్ కానీ డాన్స్ చేయకుండా తప్పించుకున్నావ్ అంటూ చెప్పుకొచ్చారు.ఇక ఈ టాక్ షో లో నాగ చైతన్య సాయి పల్లవి కి ఫోన్ చేసి కాసేపు ఆటపట్టించారు.