Unstoppable with NBK S4: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరో గానే కాకుండా హోస్ట్ గా కూడా తన సత్తా చాటుతున్నారు. బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్. ప్రముఖ ఓటిటీ ఆహా లో ఈ షో ప్రసారమవుతుంది. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తుంది. ఇక ఈ సీజన్లో ఇటీవలే విక్టరీ వెంకటేష్ పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రమోషన్ లో భాగంగా వెంకటేష్, ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి బాలయ్యతో అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు.
సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వెంకటేష్ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ షోలో బాలయ్యతో పంచుకున్నారు. ఇక ఈ టాక్ షోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) కూడా పాల్గొననున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గేమ్ చేంజర్ (Game Changer) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ ఈ షోలో బాలయ్యతో ముచ్చటించనున్నారు. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 31న హీరో రామ్ చరణ్ కు సంబంధించిన షూటింగ్ జరగనుందని సమాచారం. గతంలో ఈ టాక్ షోలో హీరో ప్రభాస్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
ఒక సందర్భంలో ఆయన హీరో రామ్ చరణ్ కు ఫోన్ చేయగా బాలయ్య మాట్లాడిన సంగతి తెలిసిందే. బాలయ్య నా షో కు ఎప్పుడు వస్తున్నావ్ అని రాంచరణ్ అడిగినప్పుడు.. మీరు పిలవడమే ఆలస్యం అంటూ రాంచరణ్ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లకు ఆ సమయం రానే వచ్చిందని తెలుస్తుంది. ఇక హీరో రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జనవరి 10న ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలయ్య నటించిన డాగు మహారాజ్ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.