Traffic Police: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన సమయంలో ట్రాఫిక్ పోలీసులు కొన్ని చర్యలు తీసుకుంటారు అనే సంగతి అందరికీ తెలిసిందే. నిబంధనలను ఉల్లంఘించిన సమయములో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపవచ్చు అలాగే చలన్ జారీ చేయవచ్చు. కొన్ని సందర్భాలలో వాహనాన్ని స్వాధీనం కూడా చేసుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ సమయంలో చట్టం అనుమతించని కొన్ని పనులను కూడా చేస్తూ ఉంటారు. చెకింగ్ సమయంలో ట్రాఫిక్ పోలీసులు కారులోని కీ లను బలవంతంగా తీసుకోవడం అలాగే టైర్లలో గాలి తీయడం వంటి పనులు చేస్తుంటారు.
అయితే చట్ట ప్రకారం ఈ పని చేసే హక్కు ట్రాఫిక్ పోలీసులకు ఉంటుందా అనే విషయం చాలామందికి తెలియదు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రాఫిక్ పోలీసులు మీ డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పేపర్, భీమా మరియు పొల్యూషన్ సర్టిఫికెట్ మిమ్మల్ని అడగవచ్చు. కానీ ట్రాఫిక్ పోలీసులకు వాహనాల నుండి తాళం తీసుకునేందుకు లేదా టైర్ల లోని గాలిని తీసేందుకు హక్కు లేదు. ఒకవేళ ట్రాఫిక్ పోలీస్ ఇలా చేసినట్లయితే అది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.
ఇటువంటి సందర్భంలో మీరు ఆ ట్రాఫిక్ పోలీసు పై ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఇండియన్ మోటార్ వెహికల్ యాక్స్ 1932 చట్టం ప్రకారం ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంగించినట్లైతే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లేదా అంతకంటే ఎక్కువ ర్యాంక్ అధికారులు మాత్రమే చలన్ జారీ చేయగలరు. అప్పటికప్పుడు జరిమానా విధించే హక్కు కేవలం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్స్పెక్టర్కు మాత్రమే ఉంటుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదా హోంగార్డుకు చలన్ విధించే అధికారం ఉండదు.